హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి రైతులు గురించి ఆలోచిస్తున్నారని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. ఆదివారం (మార్చి 22) సిద్దిపేట జిల్లా నర్మెట్టలో సీఎం రేవంత్ రెడ్డి ఆయిల్ ఫ్యాక్టరీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వివేక్ పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రం అప్పుల్లో ఉన్న ఇచ్చిన హామీ మేరకు రైతులకు రుణమాఫీ చేశామన్నారు.
రాష్ట్రంలో అద్భుతమైన అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేశామని.. కొత్త ఉద్యోగాల కల్పనకు ఏటీసీలు ఉపయోగపడతాయని తెలిపారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు స్కిల్ నేర్పించి ఉద్యోగాలు ఇప్పిస్తున్నామన్నారు. ఏటీసీలో ట్రైనింగ్ తీసుకుని విద్యార్థులకు రూ.2 వేలు ఇస్తున్నామని తెలిపారు. సిద్ధిపేటలో ఏ సమస్య ఉన్నా పరిష్కరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారన్నారు.
