- జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి, వెలుగు : ప్రజలు సెల్ఫ్ ఎన్యూమరేషన్ ద్వారా తమ వివరాలను తామే నమోదు చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించిందని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలో స్వీయ గణనపై అవగాహన మారథాన్‌లో ఆయన పాల్గొన్నారు. జూనియర్ బాయ్స్ కాలేజీ నుంచి నుంచి ప్రారంభమైన మారథాన్ పాలిటెక్నిక్ కళాశాల వరకు సాగింది. కరోనా కారణంగా 2021లో జరగాల్సిన జనగణన ఆలస్యమైందని, ఇప్పుడు దేశవ్యాప్తంగా డిజిటల్ విధానంలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
మే 11 నుంచి జూన్ 10 వరకు జిల్లాలో సుమారు 13 వేల మంది సిబ్బంది ఇంటింటికి వెళ్లి హౌస్ లిస్టింగ్ చేపడతారని తెలిపారు. ప్రజల సమాచారం పథకాల నమోదుకు వినియోగించబోరని స్పష్టం చేశారు. అనంతరం నర్సింగాయపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి తూకం, తరలింపు, చెల్లింపులను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశించారు.
