వనపర్తి, వెలుగు : ఈ నెల 26, 27 తేదీల్లో హనుమకొండ లోని జేఎన్ స్టేడియంలో జరిగే 12వ తెలంగాణ రాష్ట్ర స్థాయి జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్--2026 పోటీల్లో పాల్గొనబోయే వనపర్తి జిల్లా అథ్లెట్స్ ను ఆదివారం స్థానిక బాలకృష్ణయ్య స్టేడియం గ్రౌండ్ లో ఎంపిక చేశారు. కార్యక్రమనికి జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వాకిటి శ్రీధర్ ముఖ్య అతిథిగా హాజరై అథ్లెట్స్ ఈవెంట్స్ లో ప్రాక్టీస్ చేయడం తో పాటుగా తమ ఫిట్నెస్ ను కాపాడుకోవాలని సూచించారు.
చిరకాలంగా వనపర్తి జిల్లా అథ్లెట్స్ రాష్ట్ర, జాతీయ స్థాయి లో మెడల్స్ సాధిస్తున్నారని, అదే ఒరవడిని కొనసాగించాలన్నారు. సెలెక్షన్స్ కోసం జిల్లా నలుమూలల నుంచి 200 అథ్లెట్స్ వచ్చారు. కార్యక్రమంలో జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్, ఉపాధ్యక్షుడు శంశీర్ అలీ, సీనియర్ ప్లేయర్ అహ్మద్, పీఈటీ లు జబ్బార్, మహేశ్, ఉమశంకర్, దామోదర్, అజయ్, మాలతి, స్రవంతి పాల్గొన్నారు.
