IPL 2024: దేశమే ముఖ్యం: సన్ రైజర్స్‌కు బిగ్ షాక్ ఇచ్చిన స్టార్ బౌలర్

IPL 2024: దేశమే ముఖ్యం: సన్ రైజర్స్‌కు బిగ్ షాక్ ఇచ్చిన స్టార్ బౌలర్

ఐపీఎల్ కు ముందు శ్రీలంక స్టార్ స్పిన్నర్ వనిందు హసరంగ సన్ రైజర్స్ హైదరాబాద్ కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు. దేశం కోసం ఆడేందుకు ఐపీఎల్ ను పక్కన పెట్టేశాడు. టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన ఈ స్టార్ స్పిన్నర్.. తాజాగా తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. దీంతో బంగ్లాదేశ్ తో మార్చి 22 న జరగబోయే 2 టెస్టుల సిరీస్ లో ఆడేందుకు సిద్ధమయ్యాడు. నిన్న (మార్చి 18) బంగ్లాదేశ్ తో జరిగిన నిర్ణయాత్మకమైన మూడో వన్డేలో శ్రీలంక ఓడిపోవడంతో హసరంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. 

హసరంగ పరిమిత ఓవర్ల క్రికెట్ మీద దృష్టి పెట్టడానికి ఆగష్టు 2023లో టెస్టు క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. 26 ఏళ్ళ వయసులో హసరంగా టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకొని క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేశాడు. 2021లో శ్రీలంక తరపున 2020 లో తన తొలి టెస్టు ఆడిన ఈ లెగ్ స్పిన్నర్.. కేవలం తన కెరీర్ లో నాలుగు టెస్టులు మాత్రమే ఆడాడు. చివరిసారిగా 2021లో శ్రీలంక జట్టు తరపున టెస్ట్ మ్యాచ్ ఆడాడు. 

హసరంగా ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 2023 ఐపీఎల్ మినీ వేలంలో హసరంగాను సన్ రైజర్స్ రూ. 1.5 కోట్లకు దక్కించుకుంది. ప్రస్తుతం అద్భుత ఫామ్ లో ఉన్న ఈ శ్రీలంక స్టార్ స్పిన్నర్ లేకపోవడం హైదరాబాద్ జట్టుకు గట్టి ఎదురు దెబ్బ తగలనుంది. షాబాజ్ అహ్మద్, వాషింగ్ టన్ సుందర్ లాంటి ఆల్ రౌండర్లు ఉన్నా.. హసరంగా లాంటి సూపర్ ఆల్ రౌండర్ సేవలను కోల్పోవడం జట్టుపై ప్రభావం చూపిస్తుంది. మొదటి నాలుగు లేదా ఐదు మ్యాచ్ లకు దూరమయ్యే అవకాశం కనిపిస్తుంది.