War 2 Update: ఎన్టీఆర్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. వార్ 2 ఫస్ట్ లుక్ వచ్చేది అప్పుడే!

War 2 Update: ఎన్టీఆర్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. వార్ 2 ఫస్ట్ లుక్ వచ్చేది అప్పుడే!

ఎన్టీఆర్(Ntr) ఫ్యాన్స్ కు వరుస సర్ప్రైజ్ లు రానున్నాయి. మే 20న ఆయన పుట్టినరోజు అన్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఆరోజు పండుగరోజు. కాబట్టి.. ఆయన ప్రస్తుతం చేస్తున్న సినిమాల నుండి అప్డేట్స్ రానున్నాయి. ఇప్పటికే.. ప్రశాంత్ నీల్ తో ఆయన చేస్తున్న ఎన్టీఆర్ 31(NTR 31) నుండి అప్డేట్ రానుందని ప్రచారం జరుగుతుండగా.. తాజాగా ఆ లిస్టులోకి మరో క్రేజీ ప్రాజెక్టు చేరింది. 

అదే ఎన్టీఆర్ బాలీవుడ్ లో డెబ్యూట్ చేస్తున్న వార్ 2(War 2. హ్రితిక్ రోషన్ హీరోగా వస్తున్న ఈ సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నారు ఎన్టీఆర్. దీంతో ఈ సినిమాపై దేశవ్యాప్తంగా అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. ఇటీవలే ఈ సినిమా షూట్ లో జాయిన్ అయ్యారు ఎన్టీఆర్. దానికి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే.. తాజా సమాచారం ప్రకారం వార్ సినిమా నుండి ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ విడుదల కానుందట. ఎన్టీఆర్ పుట్టినరోజు మే 20న రానుందట. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ హ్యాపీ ఫీలవుతున్నారు. 

ఇక ఎన్టీఆర్ దేవర సినిమా విషయానికి వస్తే.. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. మే 20న ఈ సినిమా నుండి కూడా అప్డేట్ రానుందని తెలుస్తోంది. రెండు పార్టులుగా వస్తున్న ఈ సినిమాను కొరటాల శివ తెరకెక్కిస్తుండగా.. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ సైఫ్ ఆలీ ఖాన్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమాకు లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. మరి భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయనుందో చూడాలి.