దుబాయ్ వెళ్లడానికి ఇళ్లలో వరుస చోరీలు

దుబాయ్ వెళ్లడానికి ఇళ్లలో వరుస చోరీలు

దుబాయ్ వెళ్లాలనే టార్గెట్ తో ఇళ్లలో వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగను వరంగల్ CCS పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 22లక్షల విలువైన 270 గ్రామలు బంగారు అభరణాలతో పాటు 2 బైక్స్, 50వేల క్యాష్ స్వాధీనం చేసుకున్నారు. 

నిందితుడిని రాజన్న సిరిసిల్ల జిల్లా సంకేపల్లికి చెందిన బైక్ మెకానిక్ జింక నాగరాజుగా గుర్తించారు. వరంగల్, జనగాం, సిద్దిపేట, జగిత్యాల, యాదాద్రి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లోని 38పైగా ఇండ్లలో చోరీ చేసినట్లు పోలీసులు తెలిపారు.