
సమస్యలు చెప్పుకునేందుకు స్టేషన్ కు వచ్చిన బాధితులకు అండగా ఉండాల్సిన పోలీసు అధికారి.. వారిపట్ల తనే ఒక సమస్యగా మారిన ఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. స్టేషన్ ఆవరణలోనే లైంగికంగా వేధించిన కేసులో సీఐ సస్పెండ్ కావడం సంచలనంగా మారింది.
వేధింపుల కేసులో వరంగల్ మీల్స్ కాలనీ ఇన్స్స్పెక్టర్ వెంకటరత్నం సస్పెండ్ అయ్యారు. ఓ కేసులో నిందితురాలి పట్ల పోలీస్ స్టేషన్ ఆవరణలోనే లైంగిన వేధింపులకు గురి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న CI వెంకటరత్నంను సస్పెండ్ చేశారు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్.
ALSO READ | స్లీవ్లెస్ డ్రెస్ పై వెకిలి కామెంట్.. రిపోర్టర్కు దిమ్మ తిరిగే రిప్లై ఇచ్చిన యాంకర్
భూ వివాదంలో బాధితుల పై కేసులు నమోదుచేసి వేదింపులకు గురి చేశారు CI వెంకటరత్నం. బాధితుల కంప్లైంట్ మేరకు విచారణ చేపట్టిన అనంతరం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. చనిపోయిన వ్యక్తిపై కేసు నమోదు చేసి భూ వివాదంలో నిందితులకు సహకరించినట్లు విచారణలో తేలిడంతో సస్పెండ్ చేశారు.