
విచక్షణ మరిచి కామెంట్స్ చేస్తే ఏమవుతుందో ఈ యాంకర్ ఇచ్చిన సమాధానం చూస్తే అర్థమవుతుంది. ఒక హోదాలో హుందాగా వ్యవహరించాల్సిన వారు ఏది పడితే అది కామెంట్ చేసి.. అంతా సరదాకే కదా అనుకుంటే కరెక్టేనా. మనం చేసే కామెంట్ వలన నలుగురు నవ్వుకుంటారని అనుకుంటాం.. కానీ కొన్ని సార్లు మనమే నవ్వులపాలు అవుతాం అనేదానికి ఇది సరైన ఉదాహరణగా చెప్పవచ్చు.
ఒక మూవీకి సంబంధించిన ప్రమోషనల్ ఈవెంట్ లో తమిళ లేడీ యాంకర్, నటి ఐశ్యర్య రఘుపతి ని అవమాన పరిచేలా రిపోర్టర్ కామెంట్ చేశాడు. ఆమె వేసుకున్న స్లీవ్ లెస్ డ్రెస్ గురించి వెకిలిగా మాట్లాడాడు. ఈ ఇన్సిడెంట్ పై మీడియా ఫ్రెటర్నిటీ వ్యవహరించిన తీరును ఆమె తీవ్రంగా ఎండగట్టింది.
సాయిధన్సిక మూవీ యోగిదా ఈవెంట్ కు యాంకరింగ్ చేస్తున్న ఐశ్వర్య.. ఎండాకాలం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రెండు మాటల్లో వివరిస్తోంది. అది కూడా రిపోర్టర్లు ఎండలో వర్క్ చేస్తుంటారని.. సమ్మర్ హీట్ కు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
దీంతో వెంటనే ఆ రిపోర్టర్ ఆమె స్లీవ్ లెస్ డ్రెస్ పై కామెంట్ చేశాడు. ‘‘ఎండ వేడి నుంచి బయటపడేందుకేనా మీరు స్లీవ్ లెస్ వేసుకున్నది.. చల్ల గాలి తగలాలనేనా..’’ అంటూ వెకిలి కామెంట్ చేశాడు. అయితే ఆ సమయంలో తీవ్ర అసంతృప్తికి గురైన యాంకర్ ఐశ్యర్య.. మూవీ ఈవెంట్ లో తన డ్రెస్సింగ్ ఎందుకు పాయింట్ ఆఫ్ డిస్కషన్ గా మారిందని ప్రశ్నించింది.
దీంతో ఆ రిపోర్టర్ తనను తాను సమర్ధించుకుంటూ.. సమ్మర్ లో కాటన్ శారీ సూటబుల్ గా ఉంటుందని.. స్లీవ్ లెస్ ప్రశాంతను ఇస్తుందనేదే తన ఉద్దేశమని చెప్పాడు. అవునా కాదా అంటూ ప్రశ్నించాడు. ఎలా స్పందించాలో అర్థం కావటం లేదని ఇలాంటి సిల్లీ క్వశ్చన్స్ కు ఇది సమయం కాదని రిప్లై ఇచ్చింది.
ఆ తర్వాత సోమవారం (మే 19) ఈ వివాదం గురించి మరోసారి మాట్లాడింది. సదరు రిపోర్టర్ ను ఉద్దేశించి.. ‘‘మీరు అడిగిన ప్రశ్నకు నేను గాలి కోసం స్లీవ్ లెస్ వేసుకున్నానని రియలైజ్ అవ్వటానికి ఐదు నిమిషాలు పట్టింది. ఆ టైమ్ లో కోపపడాలో.. ప్రశాంతంగా ఉండాలో కూడా నాకు అర్థం కాలేదు. కానీ మీ ప్రశ్నకు సోషల్ మీడియాలో ఆడియన్స్ బాగానే సమాధానం చెబుతున్నారుగా’’ అని చురకలంటించింది. అంటే అప్పటికే డ్రెస్ గురించి ఇంత నీచంగా, వెకిలిగా మాట్లాడతా అన్నట్లుగా సోషల్ మీడియాలో ఆ రిపోర్టర్ ను గట్టిగా వేసుకున్నారు చాలా మంది.
ALSO READ | బేకార్ ముచ్చట్లు: లేనిది ఉన్నట్టు.. అంతా కనికట్టు.. కారు కూతలు.. రోత రాతలు
అయితే రిపోర్టర్ కవర్ చేసుకోవడానికి ట్రై చేస్తుంటే.. అంత సమర్థించుకోవడం పనికిరాదని ఫైర్ అయ్యింది. ‘‘మీ కామెంట్స్ చూస్తే తెలుస్తుంది.. మీకున్న విలువలేంటో’’ నని ఇచ్చి పడేసింది. ‘‘ఆ టైమ్ లో నేను ఓపికతో ఉన్నందుకు మగాళ్లంగా డామినేట్ చేసినట్లు ఫీలవుతుంటారు కదా’’ అని ప్రశ్నించింది.
అయితే ఆ టైమ్ లో కొందరు రిపోర్టర్స్ కల్పించుకుని.. అతనికి సప్పోర్ట్ గా నిలవాలని ట్రై చేశారు. అప్పుడు రిపోర్టర్ల (మీడియా ఫ్రెటర్నిటీ) ద్వంద్వ వైఖరిపై ఆమె మండి పడింది. అంత వెకిలి కామెంట్ చేసినప్పుడు మీ నోరేమైందని ప్రశ్నించింది. ఆ టైమ్ లో అతన్ని మీరెందుకు ప్రశ్నించలేక పోయారని ఫైరయ్యింది.
సొసైటీలో చాలా మంది పురుషులు పురుషాధిక్యతతో.. మహిళలంటే వెకిలిగా చిన్న చూపు చూసే ధోరణిలో ఉంటారని ఆమె కామెంట్ చేసింది. సమాజంపై అవగాహన ఉండాల్సిన రిపోర్టర్ నుంచి ఇలాంటి బిహేవియర్ చూడటం ఆశ్చర్యానికి గురి చేస్తుందని తెలిపింది ఐశ్వర్య.
ఓ ఈవెంట్లో ఫ్యాన్ చెంప చెళ్లుమనిపించింది:
డేరింగ్ రిప్లై ఇవ్వడంలోనూ.. రియాక్ట్ అవ్వడంలోనూ ఐశ్వర్య రఘుపతికి ఇది కొత్తేం కాదు. గతంలో ధనుష్ హీరోగా నటించిన ‘కెప్టెన్ మిల్లర్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేశారు. దానికి హోస్ట్‌గా ఐశ్వర్య రఘుపతి వ్యవహరించింది. అయితే ఆ ఈవెంట్ ప్రారంభం అయిన తర్వాత ఆ గుంపులో ఒక వ్యక్తి వచ్చి తనను అసభ్యకరంగా టచ్ చేశారు. టచ్ చేసిన వెంటనే పారిపోవాలని చూశాడు.
కానీ ఐశ్వర్య తనను వదలలేదు. కాలర్ పట్టుకుంది. అలా ఎలా టచ్ చేస్తావంటూ చెంపలు వాయించింది. ఈ ఘర్షణ అంతా అక్కడ ఉన్నవారు రికార్డ్ చేశారు. సోషల్ మీడియాలో అప్లోడ్ కూడా చేశారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఐశ్వర్య తెగింపు చూసి నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఈ విషయంపై ఐశ్వర్య కూడా తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా రియాక్ట్ అయ్యింది. అలాగే ఇటీవల రిపోర్టర్ ప్రశ్నకు ఘాటుగా సమాధానం ఇవ్వడమే కాకుండా ఒక లెటర్ రిలీజ్ చర్చకు తెరలేపింది.