యాక్షన్ ప్లాన్‌‌ ను రెండు రోజుల్లో అందజేయాలి :కలెక్టర్ సత్య శారదాదేవి

యాక్షన్ ప్లాన్‌‌ ను రెండు రోజుల్లో అందజేయాలి :కలెక్టర్ సత్య శారదాదేవి

గ్రేటర్​ వరంగల్/ నర్సంపేట/ పర్వతగిరి, వెలుగు: ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్‌‌ ను రెండు రోజుల్లో సమర్పించాలని వరంగల్​ కలెక్టర్ సత్య శారదాదేవి సంబంధించిన ఆఫీసర్లను ఆదేశించారు. శుక్రవారం వరంగల్ కలెక్టరేట్​లో 99 రోజుల ప్రణాళికపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా లైన్ డిపార్ట్​మెంట్ అధికారులతో సమగ్రంగా చర్చించారు.

ప్రజాప్రతినిధులను భాగస్వాములుగా చేసుకుని అభివృద్ధి కార్యక్రమాలు విస్తృతంగా అమలు చేయాలన్నారు. అనంతరం ప్రపంచ పిచ్చుకల దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ ఆవరణలో పిచ్చుకలను ప్రకృతిలోకి విడుదల చేశారు. అనంతరం నర్సంపేట మార్కెట్​ యార్డులో పీఏసీఎస్​ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్​ మార్కెట్​ కమిటీ చైర్మన్​ పాలాయి శ్రీనివాస్​తో కలిసి ప్రారంభించారు.

మొక్కజొన్న క్వింటాల్​కు రూ.2,400ల మద్దతు ధరను ప్రభుత్వం ప్రకటించిందని, రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే పంటను విక్రయించి మద్దతు ధర పొందాలని కోరారు. పర్వతగిరి పీహెచ్​సీని కలెక్టర్​ సత్యశారద డీఎంహెచ్​వో సాంబశివరావుతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేసి, రిజిస్టర్లు, మెడిసిన్​ నిల్వలు, పరిశుభ్రతను పరిశీలించారు. ఆస్పత్రిలో రోగులతో మాట్లాడుతూ వైద్య సేవలపై ఆరా తీశారు.