బాలికల భద్రత, సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించాలి : కలెక్టర్ సత్య శారదాదేవి

బాలికల భద్రత, సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించాలి : కలెక్టర్ సత్య శారదాదేవి

గ్రేటర్ వరంగల్, వెలుగు: బాలికల భద్రత, సంక్షేమంపై వార్డెన్లు ప్రత్యేక దృష్టి సారించాలని వరంగల్ కలెక్టర్​ సత్య శారదాదేవి అన్నారు. శుక్రవారం సిటీలోని నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్​లో వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాలకు చెందిన కస్తూర్భా గాంధీ బాలిక విద్యాలయాల (కేజీబీబీ) వార్డెన్ల సాధికారత లక్ష్యంగా జనవరి 19 నుంచి 23వ తేదీ వరకు నిర్వహించగా, ముగింపు సమావేశానికి కలెక్టర్​ హాజరై మాట్లాడారు. స్పెషల్ ఆఫీసర్, కేర్‌టేకర్‌గా పని చేయడం కేవలం ఉద్యోగం మాత్రమే కాదు, అది ఒక గొప్ప సేవ అని, బాలికల భవిష్యత్​ను తీర్చిదిద్దే కీలక బాధ్యతను నిర్వర్తిస్తున్నారని వార్డెన్లను అభినందించారు.

బాలికలను సొంత పిల్లల్లా చూసుకుంటూ వారి భౌతిక, మానసిక, భావోద్వేగ అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో వరంగల్​ డీఈవో రంగయ్య నాయుడు, జీసీడీవోలు కె.ఫ్లోరెన్స్, సునీత, వరంగల్ జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్ సుజన తేజ తదితరులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టరేట్​లో కలెక్టర్​ సత్యశారద ప్రీ మెట్రిక్​ స్కాలర్షిప్​ రిజిస్ట్రేషన్​పై సమీక్ష నిర్వహించారు. వరంగల్ జిల్లాలో ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ నమోదు ప్రక్రియను వంద శాతం పూర్తిచేయాలని ఆదేశించారు.