తెలంగాణను నేర రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం

తెలంగాణను నేర రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం

రాష్ట్రప్రభుత్వం ఎక్కువశాతం నిధులను పోలీస్ శాఖకు కెటాయించడంపై సంతోషం వ్యక్తం చేశారు వరంగల్ సీపీ రవీందర్. మీడియాతో మాట్లాడిన ఆయన… జనగామ పట్టణంలో వ్యాపారానికి ఎంతో ప్రాధాన్యత ఉందని ఇక్కడ రక్షణ, భద్రతలుచాలా అవసరమని చెప్పారు. శాంతి భద్రతలను కాపాడడానికి పోలీసుల కృషి చాలావుంటదని తెలిపారు. సీసీ కెమెరాల ద్వారా క్రైంను నియంత్రించడం సాధ్యమేనని చెప్పారు. సీసీ కెమెరాలుంటే నేరాలు చేయడానికి నేరస్థులు  బయపడుతారని అన్నారు. ఇంటిదొంగలను కూడా సీసీ కెమెరాలే పట్టిస్తాయని చెప్పారు.  సీసీ కెమెరాల ద్వారా భద్రత ఉంటుందని అన్నారు. వరంగల్ సీపీ పరిధిలో సీసీ కెమెరాల ద్వారా ఎన్నో కేసులు పరిష్కారం అయ్యాయని తెలిపారు.  వరంగల్ సీపీ పరిధిలో వరంగల్ అర్బన్, రూరల్, జనగామ జిల్లాల్లో 600 గ్రామాలలో 3వేల సీసీ టివి కెమెరాలను అమార్చామని ఆయన చెప్పారు. 100 కి డయల్ చేస్తే తక్షణమే స్పందన ఉంటుందని అన్నారు. పెట్రోలింగ్ వ్యవస్థను మెరుగుపరిచామని.. తెలంగాణను నేర రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ఆయన చెప్పారు.