హసన్ పర్తి, వెలుగు : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు, ఒక కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేస్తూ సీపీ సన్ ప్రీత్ సింగ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వడ్డీ వ్యాపారం నిర్వహిస్తూ, డబ్బు చెల్లించని వారి ఇంటిపై దాడికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో ఏఆర్ విభాగానికి చెందిన హెడ్ కానిస్టేబుల్ ఎం.తిరుపతిని సస్పెండ్ చేశారు.
హసన్‌పర్తి పీఎస్‌లో మద్యం సేవించి నైట్ ఇన్చార్జ్ విధులు నిర్వహించినందుకు హెడ్ కానిస్టేబుల్ టి.రాములు, స్టేషన్ అధికారి ఆదేశాలను అతిక్రమించినందుకు చెన్నారావుపేట పోలీస్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ ఓ.రమేశ్‌ను సస్పెండ్ చేస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు.

