- ఫైన్లు కట్టేందుకు భారీగా తరలివచ్చిన వాహనదారులు
వరంగల్, వెలుగు: డ్రంకన్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడినవారితో గ్రేటర్ వరంగల్ అదాలత్‍లోని జిల్లా కోర్ట్ సోమవారం కిక్కిరిసిపోయింది. థర్టీ ఫస్ట్ నైట్ మద్యం తాగి రోడ్ల మీదకు వచ్చిన వాహనాలపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
వరంగల్, హనుమకొండ, కాజీపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో 25 చోట్ల స్పెషల్ డ్రైవ్ నిర్వహించి 436 కేసులు బుక్ చేశారు. ఆయా ప్రాంతాల్లో పట్టుబడిన వారు కోర్టులో ఫైన్లు కట్టేందుకు వచ్చారు. దీంతో వందల మంది తరలివచ్చి క్యూ కట్టడడంతో కోర్ట్ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం వరకు సందడిగా కనిపించింది.
