సామాజిక ఉద్యమకారుడు గాదె ఇన్నయ్య అరెస్ట్

సామాజిక ఉద్యమకారుడు గాదె ఇన్నయ్య అరెస్ట్

 

  • జనగామ జిల్లా జాఫర్‌గఢ్‌లోని  అనాథాశ్రమంలో అరెస్ట్​ చేసిన ఎన్‌ఐఏ
  • ఉపా చట్టం కింద  కేసు నాంపల్లి కోర్టుకు తరలింపు..14 రోజుల రిమాండ్ 
  • మావోయిస్టులకు అనుకూలంగా వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు

బచ్చన్నపేట, హైదరాబాద్, వెలుగు : సామాజిక ఉద్యమకారుడు గాదె ఇన్నయ్యను  నేషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇన్వెస్టిగేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏజెన్సీ (ఎన్ఐఏ) ఆఫీసర్లు అరెస్ట్​ చేశారు. ఆదివారం జనగామ జిల్లా జాఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గఢ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మండల కేంద్రంలో ఇన్నయ్య నిర్వహిస్తున్న అనాథాశ్రమానికి 4 వాహనాల్లో వెళ్లిన ఎన్ఐఏ ఆఫీసర్లు, ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల మృతిచెందిన మావోయిస్టు కాతా రామచంద్రారెడ్డి అలియాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వికల్ప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అంత్యక్రియలకు గాదె ఇన్నయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా మావోయిస్టులకు అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తూ.. ప్రజలను ప్రేరేపించారనే ఆరోపణలతో ఆయనను అరెస్టు చేశారు. ఉపా (యూఏపీఏ) చట్టం కింద  కేసు నమోదు చేశారు. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని నాంపల్లి కోర్టుకు ఇన్నయ్యను ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐఏ అధికారులు తీసుకెళ్లారు. దీంతో కోర్టు14 రోజుల రిమాండ్​ విధించగా.. ఆయనను చంచల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గూడ జైలుకు తరలించారు.  

ఇన్నయ్య అరెస్టు అప్రజాస్వామికం

భారత్ బచావో ప్రధాన కార్యదర్శి, సామాజిక కార్యకర్త గాదె ఇన్నయ్యను ఎన్ఐఏ అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పూర్వ విప్లవ విద్యార్థి వేదిక తెలిపింది. కామ్రేడ్ క‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ట్టా రామచంద్రారెడ్డి అంత్యక్రియల సందర్భంగా ఇన్నయ్య మాట్లాడిన మాటల ఆధారంగా ఆయనపై కేసు బనాయించడం అప్రజాస్వామికమని పేర్కొన్నది. ఈ మేరకు పూర్వ విప్లవ విద్యార్థుల వేదిక‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కన్వీనర్ సాంబమూర్తి ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. కట్టా రామచంద్రారెడ్డిది ఎన్​కౌంటర్ కాదని, అత న్ని పట్టుకొని హత్య చేశారనే అనుమానాలను ఇన్నయ్య వ్యక్తం చేశారని తెలిపారు. ఇలాంటి ఫేక్ ఎన్​కౌంటర్ల తీరును ఇన్నయ్య తీవ్రంగా ఖండించారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడిన‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  మాటల ఆధారంగా క్రూరమైన, రాజ్యాంగ విరుద్దమైన ‘ఉపా’ కేసు బనాయించడం.. బీజేపీ ప్రభుత్వం ప్రశ్నించే గొంతులను నొక్కేందుకు చేసిన కుట్రనే అని ఆరోపించారు. ఇది భావప్రకటనా స్వేచ్ఛను కాలరాయడమేనని అన్నారు. ఇన్నయ్య అరెస్టును అందరూ వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ఆయన విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం కూడా చొరవ తీసుకోవాలని కోరారు. కాగా, ఇన్నయ్య అరెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను  ప్రోగ్రెసివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఆవుల నాగరాజు, కోట ఆనంద్ ఖండించారు. గాదె ఇన్నయ్యను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. 

అరెస్టును ఖండిస్తున్నం: తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ 

ముషీరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: గాదె ఇన్నయ్యను ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐఏ పోలీసులు అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నట్టు తెలంగాణ ఉద్యమకారుల జాయింట్​యాక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిటీ (టీయూజేఏసీ)  రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల ప్రపుల్ రామిరెడ్డి చెప్పారు. ఆదివారం చిక్కడపల్లిలో మీడియాతో రామిరెడ్డి మాట్లాడారు. గాదె ఇన్నయ్య  ఎంతోకాలంగా ప్రజాసేవలో ఉన్నారని, ప్రజాస్వామ్య పద్ధతుల్లో నడుచుకుంటూ అనేకమంది అనాథ పిల్లలను చేరదీసి పెంచి పెళ్లిళ్లు సైతం చేశారని చెప్పారు. ఏదో ఒక సందర్భంలో అమిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షాను విమర్శిస్తే.. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే నెపంతో అరెస్టు చేయడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా ప్రజాభివృద్ధి ఎట్లా జరుగుతుందని అడిగారు.