వరంగల్/ హనుమకొండ, వెలుగు: ఎల్ నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా నమోదుకానున్న నేపథ్యంలో రైతులను వరికి ప్రత్యామ్నాయ పంటలకు సిద్ధం చేయాలని రెవెన్యూశాఖ మంత్రి, ఉమ్మడి వరంగల్‍జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‍రెడ్డి, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆఫీసర్లను ఆదేశించారు. మంగళవారం వారు ఉమ్మడి వరంగల్‍జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులతో సుధీర్ఘ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వరి పంటకు బదులుగా తక్కువ నీటితో ప్రత్యామ్నాయ పంటలు సాగుచేసేలా రైతులను సన్నాద్ధం చేయాలని, వ్యవసామ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో విస్తృత అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఈనెల 27న వరకు వర్షాభావ పరిస్థితులు కొనసాగే అవకాశం ఉన్నందున దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.
స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్‍జిల్లాకు దేవాదుల ప్రాజెక్ట్ నీరే ప్రధాన ఆధారమన్నారు. మూడు దశల్లో 10 మోటర్లను కనీసం 100 రోజులు నిరంతరాయంగా నడిపేలా విద్యుత్, నీటిపారుదల శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాల్సి ఉంటుందన్నారు. ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‍రెడ్డి, కేఆర్ నాగరాజు, ఎమ్మెల్సీ సారయ్య మాట్లాడుతూ వరంగల్ సిటీ పరిధిలో భగీరథ నీటి పైప్‍లైన్ల లీకేజీలతో తాగునీటి సమస్యలు తలెత్తున్నాయని తెలిపారు. వాటికి మరమ్మతులు చేపిస్తే సమస్యను కొంతమేర తగ్గించవచ్చన్నారు. అమృత్‍పథకంలో చేపట్టిన పనులు వేగవంతం చేయాలన్నారు. సమావేశంలో ప్రభుత్వ సలహాదారు రామచంద్రునాయక్, ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్‍రెడ్డి, దొంతి మాధవరెడ్డి, గండ్ర సత్యనారాయణ, మురళీ నాయక్, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేకాధికారి దేవసేన పాల్గొన్నారు.
హ్యాపీ బర్త్‌డే నాయిని..
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‍రెడ్డి పుట్టిన రోజు వేడుకలను మంగళవారం కాంగ్రెస్శ్రేణులు పలుచోట్ల ఘనంగా నిర్వహించారు. వరంగల్ జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యేకు శాలువా కప్పి బర్త్‌డే శుభాకాంక్షలు తెలిపారు. హనుమకొండ కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశం అనంతరం మంత్రులు పొంగులేటి, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేల సమక్షంలో నాయినితో కేక్ కట్ చేయించారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామిరెడ్డి తదితరులున్నారు.
