లండన్​లో వరంగల్ యువతి ఆత్మహత్య

లండన్​లో వరంగల్ యువతి ఆత్మహత్య

వరంగల్​, వెలుగు : లండన్ బ్లూమ్స్ బెర్రీ ఇనిస్టిట్యూట్​లో చదువుతున్న వరంగల్​కు చెందిన ఓ విద్యార్థిని సోమవారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. నగరంలోని పోచమ్మ మైదాన్ ప్రాంతానికి చెందిన బసవరాజ్ రమేశ్, విజయ దంపతుల కూతురు శ్రావణి(27). రమేశ్​ లారీ డ్రైవర్ కాగా తల్లి గృహిణి. అప్పులు చేసి, ఉన్న కొన్ని అస్తులు అమ్మి ఎనిమిది నెలల కింద శ్రావణిని లండన్ పంపారు. ఏడాదిలో జాబ్​లో జాయిన్ ​అవుతుందని, అప్పులన్నీ తీర్చెయ్యవచ్చని అనుకున్నారు. ఆ పరిస్థితి కనిపించకపోవడంతో శ్రావణి కలత చెందింది.

ఈ కారణంతోనే శ్రావణి ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. విషయం తెలుసుకున్న లండన్​లోని వరంగల్ ఎన్నారై ఫోరం బృందం అధ్యక్షుడు శ్రీధర్ నీల, ఫౌండర్ కిరణ్ పసునూరి, జాయింట్ సెక్రెటరీ ప్రవీణ్ బిట్ల, ఉమెన్ వింగ్ సెక్రెటరీ మేరీ ఏగా అక్కడి ఇండియా ఎంబసీ అధికారులతో మాట్లాడారు. బుధవారం ఉదయం శ్రావణి డెడ్​బాడీని శంషాబాద్​ఎయిర్​పోర్ట్​కు తీసుకురానున్నారు. అలాగే శ్రావణి కుటుంబానికి రూ. 30 లక్షల ఆర్థిక సాయం చేశారు.