జ్యోతిష్యం:ఇంపార్టెంట్ వర్క్..ఏ రోజు బయటకు వెళ్లాలి.. ఇవి ఎదురు వచ్చాయా..మీకు తిరుగుండదు.! 

జ్యోతిష్యం:ఇంపార్టెంట్ వర్క్..ఏ రోజు బయటకు వెళ్లాలి.. ఇవి ఎదురు వచ్చాయా..మీకు తిరుగుండదు.! 

చాలా మంది ఎప్పుడు ఏ పనిపై ఎక్కడకు వెళ్లినా కలిసిరాదు.. కొంతమందికి వెళ్లడంతోనే వెళ్లిన  పని చాలా సులువుగా అవుతుంది.  కొంతమందికి అనేక అడ్డంకులు ఏర్పడుతాయి.. బయటకు వెళ్లేటప్పుడు ముహూర్తం అవసరమా.. ఏ రోజు ఏ దిక్కున వెళితే తల పెట్టిన పని పూర్తవుతుంది. ఎప్పుడు  ప్రయాణిస్తే మనకు శుభం జరుగుతుంది. రాహుకాలం..   యమగండంలో  వర్జ్యం.. దుర్మూహూర్తంలో పని ప్రారంభిస్తే ఏమవుతుంది.. పండితులు ఏమంటున్నారు...మొదలగు విషయాలనుఈ స్టోరీలో తెలుసుకుందాం. . .!

పండితులు తెలిపిన వివరాల ప్రకారం .. శుక్లపక్షములో విదియ, తదియ, పంచమి, సప్తమి, దశమి తిథులు. అశ్వని, మృగశిర, పునర్వసు, పుష్యమి, హస్త, అనూరాధ, మూల, శ్రవణం, ధనిష్ఠ, రేవతి నక్షత్రములు మంచివి. బహుళ పక్షములో కూడా ప్రయాణం చేయుటకు ఈ ప్రకారం పాటించవలయును. రాహుకాలం, గుళిక కాలం, యమగండ కాలం, వర్జ్యం విషయములో కూడా మంచిది కాదని పండితులు చెబుతున్నారు.

పెద్దలు అనుభవంతో వ్రాసిన దుర్ముహూర్త కాలమును ప్రతిరోజు ఆచరించాలి. ప్రతిరోజు అమృతగడియలలో ప్రయాణం చేయవచ్చును. బయటకు వెళ్ళవచ్చును. తూర్పు ప్రయాణం చేయవలయును అనుకుంటే వారము, లగ్నం పాటించాలి. మీరు తీర్థయాత్రలు చేయవలెను అనుకుంటే ముహూర్తబలంతో వెళితే ప్రయాణంలో ఎలాంటి ప్రమాదములు జరగకుండా క్షేమంగా తిరిగి వస్తారు. ఈ విధంగా ఎనిమిది దిక్కులకు ప్రయాణం చేయాలి అంటే ఆలోచన చేసి వెళ్ళుట మంచిదని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

నవమి ఆదివారం పడమర దిక్కు వెళ్ళటం మంచిది కాదు. ఏకాదశి సోమవారం, పంచమి మంగళవారం, తదియ బుధవారం, షష్ఠి గురువారం, అష్టమి శుక్రవారం, ద్వాదశి శనివారం ఉన్న రోజులలో ప్రయాణం చేయరాదు. అనేక విధములుగా కష్టనష్టములు కలుగుటకు అవకాశములుండును. చెడు రోజులు ఎవరికి వారు తెలుసుకొని ఆచరించండి. ఆనందంగా ప్రయాణం చేయండి, క్షేమంగా తిరిగిరండి.

ప్రయాణమునకు మంచి శకునములు

ముత్తైదువ స్త్రీ, వేశ్య, కన్య, పెండ్లి ఊరేగింపు, ఇద్దరు బ్రాహ్మణులు, మంగళమగు ఊరేగింపు, పండ్లు, పువ్వులు, ఛత్రము, చామరము, గుఱ్ఱము, ఏనుగు, పూర్ణకుంభము, చెరుకు, పాలు, పెరుగు, క్యారేజి, ఆవు, కల్లుకుండ, తేనె, వస్త్రవ్యాపారి, తెల్లని వస్తువులు, చల్లనిగాలి, వృషభము మొదలగునవి మనకు ఎదురు వచ్చిన చాలా మంచిదని పండితులు చెబుతున్నారు.

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారంతో పండితుల సలహాలను  వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  సమస్యలకు  నిపుణులను సంప్రదించటం ఉత్తమం.