రైతు బడ్జెట్ : రైతు భరోసాకు రూ. 18 వేల కోట్లు.. పంట బీమాకు గ్రీన్ సిగ్నల్

  రైతు  బడ్జెట్  :  రైతు భరోసాకు రూ. 18 వేల కోట్లు.. పంట బీమాకు గ్రీన్ సిగ్నల్
  • వ్యవసాయానికి రూ.23,179 కోట్లు
  • రైతు భరోసాకు రూ.18 వేల కోట్లు 
  • పంటలకు బోనస్​ రూ.3,500 కోట్లు
  • ఈ యేడాది పంట బీమాకు గ్రీన్​ సిగ్నల్..

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం 2026–27బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి రూ.23,179 కోట్లు కేటాయించింది. ఇందులో సింహభాగం రూ.18 వేల కోట్లు రైతు భరోసాకే కేటాయింపులు చేసింది. ఎకరానికి రూ. 12 వేల చొప్పున రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నారు. ఇందుకోసం గత బడ్జెట్​లోనూ రూ.18 వేల కోట్లు కేటాయించగా ఈ యేడు అంతే మొత్తాన్ని కేటాయించింది.

వ్యవసాయ పంటలకు బోనస్​ఇచ్చేందుకు రూ.3,500 కోట్లు కేటాయింపులు చేసింది. గత ఏడాది కేటాయింపుల కంటే ఈసారి బోసన్​ కోసం రెండింతలు కేటాయించింది. ఈ యేడాది బడ్జెట్​లో క్రాప్​ ఇన్సూరెన్స్​కు రూ.1,886 కోట్లు కేటాయించింది. గతంలోనే పంటల బీమా పథకాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నా సాధ్యం కాలేదు. ఈసారి కేటాయింపులు చేయడంతో బీమా అమలుకు మార్గం పడింది. గత ఏడాది వ్యవసాయానికి రూ.24,439 కోట్లు కేటాయించగా.. ఈసారి కేటాయింపులు రూ.1,260 కోట్లు తగ్గాయి. 

స్కీమ్​ల పద్దు ఇలా.. 

వ్యవసాయ శాఖ కేటాయింపుల్లో స్కీమ్​పద్దుల కింద అగ్రికల్చర్​ సెక్టార్​కు రూ.15,187.47 కోట్లు, హార్టికల్చర్​ సెక్టారుకు రూ.758. 89 కోట్లు కేటాయించారు. అగ్రికల్చర్​ సెక్టారులో స్టేట్​స్పాన్సర్డ్​స్కీమ్స్ లో భాగంగా ల్యాబ్స్ నిర్వహణకు రూ.3 కోట్లు, విత్తన సరఫరాకు రూ.​109.32 కోట్లు, సీడ్​ డెవలప్​మెంట్​కార్పొరేషన్​కు ఆర్థికసాయం కింద రూ.5.10 కోట్లు, చిన్న సన్నకారు రైతులకు పంట బీమా కోసం రూ.981.11 కోట్లు కేటాయించింది.

రైతుబీమా కోసం నిధులు కేటాయించలేదు. ఫామ్​ మెకనైజేషన్​కు రూ.25.47 కోట్లు, రైతు భరోసాకు రూ.13, 603 కోట్లు, రైతు సంక్షేమ కమిషన్​కు రూ.కోటి, మార్కెట్​ఇంటెర్వెన్షన్​ ఫండ్​కోసం రూ. కోటి కేటాయించారు. అగ్రికల్చర్​ వర్సిటీకి రూ.15.90 కోట్లు, హార్టీకల్చర్​ వర్సిటీకి రూ.4 కోట్లు, కోడంగల్​లో నిర్మిస్తున్న అగ్రికల్చర్​ కాలేజీకి రూ.50 కోట్లు ప్రకటించారు.

సెంట్రల్​ స్సాన్సర్డ్​ స్కీమ్​ లో నేషనల్​ ఫుడ్​ సెక్యూరిటీ మిషన్​లో రూ.6.80 కోట్లు, నేషనల్​ మిషన్​ ఆన్​ అగ్రికల్చర్​ ఎక్స్​టెన్షన్​ అండ్​ టెక్నాలజీకి రూ.80.28 కోట్లు, ఆత్మనిర్భర్​ భారత్​లో పప్పు ధాన్యాల కోసం రూ.18.32 కోట్లు, నూనె గింజల కోసం రూ.64 లక్షలు, ఆయిల్​ పామ్​ మిషన్​ కోసం రూ.26.92 కోట్లు, ఆర్​కేవీవై కోసం రూ.135.76 కోట్లు, నేచురల్​ ఫామింగ్​ రూ.22.55 కోట్లు, సబ్​ మిషన్​ ఆన్​ అగ్రికల్చర్​ ఎక్స్​టెన్షన్​ కు రూ.25.35 కోట్లు కేటాయించింది.

అగ్రికల్చర్​ నేషనల్​ ఈ గవర్నెన్స్​ ప్లాన్​ కోసం రూ.27.42 కోట్లు కేటాయింపులు చేసింది. హార్టికల్చర్​ రంగంలో గ్రీన్​హౌజ్, పాలీహౌజ్, షేడ్​ నెట్​ కోసం రూ.3 కోట్లు, గవర్నమెంట్​ గార్డెన్​ల అభివృద్ధికి రూ.4.50 కోట్లు, హార్టీకల్చర్​ ప్రమోషన్​ యాక్టివిటీ కోసం రూ.27.23 కోట్లు, ఆయిల్​ పామ్​ కల్టివేషన్​కు రూ.20 కోట్లు కేటాయించింది. సెంట్రల్​ స్పాన్సర్డ్​ స్కీమ్స్​లో హార్టీకల్చర్​ మిషన్​ రూ.175.68 కోట్లు, మైక్రో ఇరిగేషన్​కు రూ.305.77 కోట్లు, నేషనల్​బాంబూ మిషన్​కు రూ.4.21 కోట్లు, ఆయిల్​ పామ్​కు రూ.210.66 కోట్లు కేటాయింపులు చేసింది.