
హైదరాబాద్ లో దారుణం జరిగింది. ఆస్పత్రిలో పేషెంట్ పై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు వార్డ్ బాయ్. ఈ ఘటన హైదరాబాద్ విద్యానగర్ లోని ఆంధ్ర మహిళా సభ దుర్గాబాయ్ దేశ్ ముఖ్ ఆసుపత్రిలో జరిగింది.
దుర్గాబాయ్ ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ కోసం వచ్చిన ఓ మహిళా పేషెంట్ పై జులై 14న వార్డ్ బాయ్ అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. వార్డ్ బాయ్ అసభ్య ప్రవర్తనతో మహిళ పేషెంట్ కేకలు వేసింది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది, మహిళ కుటుంబ సభ్యులు వార్డ్ బాయ్ ను చితకబాదారు. అనంతరం నల్లకుంట పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితురాలి కుటుంబ సభ్యులు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు నల్లకుంట పోలీసులు. అసభ్యంగా ప్రవర్తించిన వార్డుబాయిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
ALSO READ : ఆర్టీసీ బస్సు కింద పడి ఇంటర్ విద్యార్థిని మృతి