మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యం : ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు 

మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యం : ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు 

వర్ధన్నపేట, వెలుగు : నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే తమ లక్ష్యమని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలో 100 పడకల ప్రభుత్వ ఆస్పత్రి ఏర్పాటు కోసం మాజీ టెస్కాబ్ చైర్మన్ మార్నేని రవీందర్ రావుతో కలిసి ఆయన స్థలాన్ని పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వర్ధనపేట టౌన్ సమీపంలో 100 పడకల ప్రభుత్వ ఆస్పత్రి ఏర్పాటు కోసం స్థలాన్ని పరిశీలించినట్లు తెలిపారు. ఈ ఆస్పత్రి ఏర్పాటుతో గ్రామీణ ప్రజలకు వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. వారి వెంట కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.