వార్నర్ స్టన్నింగ్ క్యాచ్ ..!

వార్నర్ స్టన్నింగ్ క్యాచ్ ..!

డేవిడ్ వార్నర్..ఈ పేరు చెబితే..ఫ్యాన్స్కు ఎక్కడ లేని కిక్కొస్తుంది. అతనో క్రేజీ క్రికెటర్ అని చెప్పొచ్చు. మ్యాచులో అతను ఉన్నాడంటే చాలు..అభిమానులకు అసలైన క్రికెట్ విందు అందడం ఖాయం.   బ్యాటింగ్తో ప్రేక్షకులను అలరించే వార్నర్..మెరుపు ఫీల్డర్ కూడా.  ఫీల్డింగ్లో అతను పెట్టె ఎఫర్ట్ అద్భుతం. అందుకే అతని వద్దకు వచ్చిన బాల్..కచ్చితంగా వార్నర్ను దాటదు. 35 ఏళ్ల వార్నర్ ఎన్నో అద్భుతమైన క్యాచులను తీసుకున్నాడు. అసాధ్యమైన క్యాచులను ఒంటి చేత్తో తీసుకుని ఔరా అనిపించిన సందర్భాలెన్నో ఉన్నాయి.  తాజాగా శ్రీలంతో జరిగిన ఫస్ట్ వన్డేలో వార్నర్ స్టన్నింగ్ క్యాచ్ తీసుకున్నాడు.   

 శ్రీలంక ఇన్నింగ్స్ 16వ ఓవర్‌లోఆష్టన్ అగర్ బౌలింగ్ లో   ధనంజయ డి సిల్వా   మిడాన్ మీదుగా బౌండరీ కొట్టేందుకు ప్రయత్నించాడు. అయితే అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న వార్నర్..రైట్ సైడ్కి పరిగెత్తి..అమాంతం గాల్లోకి ఎగిరి బాల్ను ఎడమ చేత్తో అద్భుతంగా పట్టుకున్నాడు. బాల్ గాల్లోకి లేవగానే బాల్ వైపే చూస్తుండిపోయిన  అగర్..వార్నర్ క్యాచ్ పట్టుకుంటాడని అస్సలు నమ్మలేదు. అయితే కరెక్ట్ టైమింగ్తో ఎగిరిన వార్నర్..కళ్లు చెదిరే విధంగా బంతిని అందుకుని ఆశ్చర్య పరిచాడు. ప్రస్తుతం ఈ క్యాచ్కు సంబంధించిన వీడియో వైరల్ అయింది. 

మరోవైపు మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా తొలి వన్డేలో ఆస్ట్రేలియా 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 50 ఓవర్లలో 7 వికెట్లకు 300 పరుగులు చేసింది. ఆ తర్వాత వర్షం కారణంగా ఆసీస్ టార్గెట్ను 44 ఓవర్లలో 282 రన్స్కు అంపైర్లు కుదించారు. దీంతో ఛేజింగ్కు దిగిన ఆసీస్..42.3 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 282 పరుగులు చేసి గెలిచింది.