రూ.98లక్షల విలువైన అరటిపండు తిని.. గోడకు తొక్కను అంటించిండు

రూ.98లక్షల విలువైన అరటిపండు తిని.. గోడకు తొక్కను అంటించిండు

ఆకలి.. ఎంతటివారినైనా ఏమైనా చేసేందుకు ప్రోత్సహిస్తుంది. అదే తరహాలో మ్యూజియం సందర్శనకు వెళ్లిన ఓ విద్యార్థి.. చాలా ఆకలి వేయడంతో అక్కడ ప్రదర్శనకు ఉంచిన అరటిపండు తిని వైరల్ గా మారాడు. తాను ఎలాంటి అల్పాహారం తీసుకోకుండా మ్యూజియం సందర్శనకు వెళ్లానని, అక్కడికి వెళ్లగానే చాలా ఆకలేసిందని ఆ విద్యార్థి చెప్పాడు. అక్కడ సమయానికి తినడానికి ఏమీ లేకపోవడంతో గోడకు ప్లాస్టర్ తో అతికించిన అరటిపండును తిన్నానని తెలిపాడు. దీన్నంతటినీ అతని తోటి విద్యార్థి, స్నేహితుడు రికార్డు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

ఇక్కడ చెప్పుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే.. దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లోని లీమ్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచిన అరటిపండు ఖరీదు దాదాపు రూ.98లక్షలు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో విద్యార్థి గోడకు అతికించి ఉన్న అరటిపండును తీసుకుని తిన్నాడు. ఆ తర్వాత అరటిపండు తొక్కను ప్లాస్టర్ తో గోడకు అతికించి, అక్కడ్నుంచి వెళ్లిపోయాడు.

గోడపై ఓ కళాఖండంగా అమర్చిన ఈ అరటిపండుకు 'ది కమెడియన్' అని పేరు కూడా పెట్టారు. విషయం గ్రహించిన మ్యూజియం అధికారులు.. ఆ తొక్కను తీసివేసి, మరో కొత్త అరటిపండును ఉంటారు. ఆ తర్వాత దాని విలువ తెలుసుకుని విద్యార్థి కూడా కాస్త కలత చెందాడు.

https://twitter.com/wannartcom/status/1653059201143566344