వైట్ హౌస్ పై తెలుగు కుర్రాడి దాడి.. బైడెన్​ను చంపేందుకేనని వెల్లడి

వైట్ హౌస్  పై తెలుగు కుర్రాడి దాడి.. బైడెన్​ను చంపేందుకేనని వెల్లడి

వాషింగ్టన్ డీసీలోని వైట్ హౌస్ పరిసరాల్లో ఓ ట్రక్కు బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో భారతీయ సంతతికి చెందిన తెలుగు యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మే 22న రాత్రి వైట్ హౌస్ సమీపంలోని లఫాయెట్ స్క్వేర్ వద్ద అతివేగంగా వెళ్తున్న ట్రక్కు సెక్యూరిటీ బారికేడ్లను ఢీకొట్టింది. దీంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ట్రక్కు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ట్రక్కు డ్రైవర్‌ను సాయివర్షిత్ కందులగా గుర్చించిన పోలీసులు.. అతను భారతీయ సంతతికి చెందిన తెలుగు యువకుడిగా కనుగొన్నారు.

ఈ ఘటనపై యువకుడిని ప్రశ్నించగా.. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ కమలా హారిస్‌లను టార్గెట్‌ చేసుకుని ఈ పనికి ఒడిగట్టినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు సాయివర్షిత్ కందుపై మారణాయుధాలు ఉపయోగించడం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, రాష్ట్రపతి ప్రాణాలకు హాని కలిగించేందుకు ప్రయత్నించడం, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం తదితర అభియోగాలతో కేసు నమోదు చేశారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు.

ఈ విషయాన్ని అధికారులు మే 23న ఉదయం అధ్యక్షుడు బైడెన్ దృష్టికి తీసుకెళ్లారు. USAలోని చెస్ట్‌ఫీల్డ్‌కు చెందిన సాయివర్షిత్‌ని మార్క్వెట్ సీనియర్ హై స్కూల్‌లో 2022 గ్రాడ్యుయేట్‌గా అధికారులు గుర్తించారు. అలాగే సోషల్ మీడియాలోని ఖాతాల ద్వారా అతని వ్యక్తిగత వివరాలను సేకరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. యునైటెడ్ స్టేట్స్‌లోని స్థానిక మీడియా నివేదికల ప్రకారం, సాయివర్షిత్ నడిపిన ట్రక్కులో లభ్యమైన నాజీ జెండాలను బట్టి చూస్తే అతను జర్మన్ నాజీ భావజాలానికి మద్దతుదారునిగా చెలుస్తోంది.