
ముంబై: టీమిండియాలోకి స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ రీఎంట్రీ మరింత ఆలస్యం అయ్యేలా ఉంది. ఐపీఎల్‌లో అయిన గాయం నుంచి కోలుకుని జింబాబ్వే టూర్‌కు ఎంపికైన అతను మరోసారి గాయపడ్డాడు. కౌంటీ క్రికెట్‌లో భాగంగా మాంచెస్టర్‌లో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా ఎడమ భుజానికి దెబ్బ తగిలింది. దాంతో, ఈ నెల 18 నుంచి జరిగే జింబాబ్వే టూర్‌కు అతను దూరం కానున్నాడు. లోకేశ్ రాహుల్ కెప్టెన్సీ లోని ఇండియా శనివారం ఉదయం జింబాబ్వే వెళ్తుంది. సుందర్ యూకే నుంచి నేరుగా హరారే చేరుకోవాల్సి ఉంది. కానీ, గాయానికి చికిత్స కోసం అతను యూకేలోనే ఉండనున్నాడు.