హృతిక్ పాటకు డాక్టర్ స్టెప్ లు..కరోనా పేషెంట్ల ఫిదా

హృతిక్ పాటకు డాక్టర్ స్టెప్ లు..కరోనా పేషెంట్ల ఫిదా

పీపీఈ కిట్ ధరించిన ఓ డాక్టర్ కరోనా వార్డ్ లో వేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అస్సాంకు చెందిన ఈఎన్టీ డాక్టర్ అరుప్ సేనాపతి సిల్ చార్ మెడికల్ కాలేజీ కరోనా వార్డ్ లో బాధితులకు ట్రీట్మెంట్ అందిస్తున్నారు. బాధితుల్ని ఉత్సాహా పరిచేందుకు డాక్టర్ అరుప్ పీపీఈ కిట్ ధరించి బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ యాక్ట్ చేసిన వార్ సినిమాలోని గూంగ్ రో పాటు స్టెప్ లేశారు. ఆ వీడియోను డాక్టర్ సయ్యద్ ఫాయిజాన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు, డాక్టర్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

ఈ సందర్భంగా సేనాపతి మాట్లాడుతూ గత వారం రోజులుగా నిర్విరామంగా పేషెంట్లకు ట్రీట్మెంట్ అందిస్తున్నాం. ఇంకా చేయాలి. కరోనా పేషెంట్లకు అండగా ఉంటూ ఈ స్ట్రెస్ నుంచి రిలాక్స్ అయ్యేందుకు ఖచ్చితంగా డ్యాన్స్ చేస్తానని మా సిబ్బందితో చెప్పా. వారికి చెప్పినట్లుగానే డ్యాన్స్ చేశానంటూ ఆనందం వ్యక్తం చేశారు.