ప్రధాని మోడీ అధ్యక్షతన భేటీ అయిన కేంద్ర మంత్రివర్గం దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా 2 కీలక చారిత్రాత్మక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధికి రూ.10వేల కోట్ల కేటాయింపుతో పాటు.. రవాణా అండ్ లాజిస్టిక్స్ రంగాన్ని సమన్వయం చేయడానికి 'ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ లాజిస్టిక్స్ అథారిటీ' ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
దేశంలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల్లో వృద్ధి దశలో ఉన్న కంపెనీలకు ఈ 'ఎస్ఎంఈ గ్రోత్ ఫండ్' ద్వారా ప్రత్యక్ష ఈక్విటీ పెట్టుబడులు అందనున్నాయి. ఇప్పటివరకు మార్కెట్లో ఉన్న మెజారిటీ ఫండ్స్ అన్నీ కేవలం ప్రారంభ దశలో ఉన్న మైక్రో పరిశ్రమలకే పరిమితం కావడం వల్ల గ్రోత్-స్టేజ్ క్యాపిటల్ కొరత తీవ్రంగా ఉంది. ఈ లోపాన్ని సరిదిద్దేందుకే ప్రభుత్వం రూ.10వేల కోట్లతో ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‌ను ఏర్పాటు చేస్తోందని కేంద్రం వెల్లడించింది.
ఈ ఫండ్ ద్వారా వచ్చే పెట్టుబడులతో ఎస్ఎంఈలు తమ వ్యాపార కార్యకలాపాలను విస్తరించుకోవడంతో పాటు, ఆధునిక సాంకేతికతను జోడించడం, గ్లోబల్ వాల్యూ చైన్‌లో భాగస్వామ్యం కావడం సులభమవుతుంది. ముఖ్యంగా టైర్-2, టైర్-3 నగరాల్లోని పారిశ్రామిక క్లస్టర్లలో ఉన్న చిన్న, మధ్యతరహా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లకు ఈ నిధుల్లో ఎక్కువ భాగం కేటాయించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇక రవాణా రంగానికి సంబంధించి దేశంలో వివిధ మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయాన్ని పెంచేందుకు స్పెషల్ పర్పస్ వెహికల్ రూపంలో ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ లాజిస్టిక్స్ అథారిటీ (ITLA) ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రోడ్లు, రైల్వేలు, పోర్టులు, సివిల్ ఏవియేషన్, జలమార్గాలు వంటి అన్ని రవాణా విభాగాలను అనుసంధానిస్తూ ఈ సంస్థ 10 ఏళ్లలో జాతీయ రవాణా మాస్టర్ ప్లాన్‌ను రూపొందించనుంది.
ALSO READ : కొత్త కారు కొంటున్నారా..? డీలర్ల వద్ద ఇన్సూరెన్స్ కొనేముందు ఈ విషయాలు తెలుసుకోండి
రూ.500 కోట్లు అంతకంటే ఎక్కువ ఖర్చు అయ్యే మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల టెక్నికల్ అప్రైజల్‌తో పాటు, జీఎస్టీ ఈ-వే బిల్లులు, ఫాస్టాగ్, వాహన్ వంటి ఆధునిక డాటా సోర్సెస్ ఆధారంగా 'నేషనల్ ట్రాన్స్‌పోర్ట్ డాటా రిపాజిటరీ'ని కూడా ITLA నిర్మించనుంది. తాజా నిర్ణయాలతో దేశంలో లాజిస్టిక్స్ ఖర్చులు తగ్గి, రవాణా రంగం మరింత వేగవంతమై భారత్ గ్లోబల్ కాంపిటిటివ్‌నెస్‌లో ముందుండేలా కేంద్రం పకడ్బందీ ప్లాన్స్ సిద్ధం చేస్తోంది.
