కార్ల తయారీ సంస్థ స్కోడా ఆటో ఇండియా లగ్జరీ సెడాన్ 'స్లావియా' ఫేస్‌లిఫ్ట్ వర్షన్‌ను ఇండియన్ మార్కెట్‌లో అధికారికంగా విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ. 9.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. కొత్త లుక్, ఎక్స్ట్రా ఫీచర్లు, టెక్నాలజీ అప్‌గ్రేడ్‌లతో ఈ కారును తీసుకొచ్చారు. వచ్చే వారం నుంచే కస్టమర్లకు డెలివరీలు ప్రారంభం కానున్నాయి.
స్కోడా స్లావియా లేటెస్ట్ ఎక్స్‌టీరియర్ డిజైన్
కారు ముందు, వెనుక భాగాలు సరికొత్త లుక్‌తో మెరిసిపోతున్నాయి. కొత్త LED హెడ్‌లాంప్‌లు, టెయిల్‌లాంప్‌లు ఇంకా వెనుక సీక్వెన్షియల్ టర్న్ ఇండికేటర్లు అందించారు. ముందు భాగంలో క్రోమ్ స్ట్రిప్‌తో కొత్త గ్రిల్, స్పోర్టీ అల్లాయ్ వీల్స్ ఇచ్చారు.
మాంటే కార్లో (Monte Carlo) ఎడిషన్ బ్లాక్ కలర్ లుక్, రెడ్ కలర్ డీటైలింగ్, స్పెషల్ బ్యాడ్జింగ్‌తో ఫుల్ స్పోర్టీగా కనిపిస్తుంది. ఈ కారు మొత్తం 8 రంగుల్లో వస్తుంది. ఇందులో 'ఆర్కిటిక్ సీల్వర్', 'కాపుచినో బేజ్' అనే రెండు కొత్త కలర్ అప్షన్ చేరాయి.
అద్భుతమైన ఇంటీరియర్
ఈ సెగ్మెంట్‌లోనే మొదటిసారిగా వెనుక సీట్లలో ప్రయాణించే వారి కోసం 'మసాజ్ ఫంక్షన్' సౌకర్యాన్ని అందించారు. ముందరి సీట్లకు వెంటిలేషన్ ఇంకా ఎలక్ట్రానిక్ అడ్జస్ట్‌మెంట్ సౌకర్యం ఉంది. 360-డిగ్రీ కెమెరా, పార్క్ పైలట్, ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్లు ఉన్నాయి. 10.25-ఇంచుల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, 10-ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఇచ్చారు. గూగుల్ జెమిని ఏఐ వాయిస్ అసిస్టెంట్‌తో మాటల ద్వారానే కాల్స్ చేయడం, మ్యూజిక్ మార్చడం, ఏసీ టెంపరేచర్ కంట్రోల్ చేయవచ్చు.
ఇంజిన్ అండ్ గేర్‌బాక్స్ ఆప్షన్లు
స్లావియా రెండు పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. ఒకటి 1.0-లీటర్ TSI పెట్రోల్ ఇంజిన..: ఇది 6-స్పీడ్ మాన్యువల్ సాండ్ ఈ సెగ్మెంట్‌లోనే మొదటిసారిగా 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. రెండోది 1.5-లీటర్ TSI పెట్రోల్ ఇంజిన్ ఇది 7-స్పీడ్ DSG ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఈ 1.5L వేరియంట్లకు వెనుక చక్రాలకు కూడా డిస్క్ బ్రేక్స్ ఇచ్చారు.
ALSO READ : మసాలా దోశలో ఎలుక.. హోటల్ ఓనరుని 25 లక్షలు ఇవ్వాలని బ్లాక్‌మెయిల్..
సేఫ్టీ ఫీచర్స్
గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో పెద్దలు, పిల్లల సేఫ్టీలో 5-స్టార్ రేటింగ్ పొందింది. అన్ని వేరియంట్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 25కి పైగా సేఫ్టీ ఫీచర్లు స్టాండర్డ్‌గా ఉంటాయి. టాప్ వేరియంట్లలో 40కి పైగా సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. 4 సంవత్సరాలు / 1,00,000 కి.మీ వారంటీ, 4 ఏళ్ల రోడ్‌సైడ్ అసిస్టెన్స్, 4 ఫ్రీ సర్వీసులు లభిస్తాయి. కావాలంటే ఈ వారంటీని మరో 2 ఏళ్లు పొడిగించుకోవచ్చు. మొత్తంగా స్కోడా స్లావియా క్లాసిక్, క్లాసిక్+, సిగ్నేచర్, స్పోర్ట్‌లైన్, ప్రెస్టీజ్ ఇంకా మాంటే కార్లో అనే 6 వేరియంట్లలో లభిస్తుంది.
