యజమాని ఇంట్లోనే చోరీకి తెగబడిన వాచ్‌మెన్ దంపతులు

V6 Velugu Posted on Oct 16, 2021

  • హైదరాబాద్ చింతలబస్తీలో ఘటన

హైదరాబాద్: యజమాని ఇంటిలోనే చోరీకి తెగబడ్డారు వాచ్‌మెన్ దంపతులు. హైదరాబాద్ నడిబొడ్డున చింతల్ బస్తీలో జరిగిందీ ఘటన. నగరంలోని యజ్ఞ అగర్వాల్ టెక్స్ టైల్స్ యజమాని అగర్వాల్ చింతల్ బస్తీలో నివసిస్తున్నారు. తన ఇంటికి వాచ్ మెన్లుగా పనిచేసేందుకు నేపాల్ దంపతులను నియమించుకున్నాడు. తాను వ్యాపారాల నిమిత్తం బయటకు వెళ్లినప్పుడు తల్లిదండ్రులకు తోడుగా నేపాల్ కు చెందిన వాచ్ మెన్ దంపతులపైనే ఆధారపడేవాడు. యజమాని ఇంట్లో బాగా డబ్బు, నగలుంటాయని భావించిన వాచ్ మెన్ దంపతులు యజమాని లేని సమయం చూసి ఆయన తల్లిదండ్రులను తాళ్లతో కట్టేసి చోరీకి పాల్పడ్డారు. ఇంట్లో బీరువాలు తనిఖీ చేసి బంగారు ఆభరణాలు దొరకడంతో వాటిని తీసుకుని ఉడాయించారు. ఇంటికి తిరిగొచ్చిన యజమాని అగర్వాల్ తన తల్లిదండ్రులను కట్టేసి ఉండడం గమనించి నిర్ఘాంతపోయాడు. చోరీ చేసి ఉడాయించారని తెలుసుకుని సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Tagged Hyderabad, robbery, theft, Owner, Agarwal, watchman, chinthalbasti, yagna textiles, nepal couple, watchman couple

Latest Videos

Subscribe Now

More News