
హైదరాబాద్‌సిటీ, వెలుగు: ఔట్సోర్సింగ్ఉద్యోగులకు న్యాయం చేయాలని ఆల్ఇండియా కాన్ఫడరేషన్ఆఫ్ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీస్సంఘాల సమాఖ్య అధ్యక్షుడు మహేశ్వర్‌రాజ్ కోరారు. శుక్రవారం ఆయన ఆధ్వర్యంలో రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి వివేక్ వెంకట స్వామిని గ్రేటర్ హైదరాబాద్ మెట్రోవాటర్సప్లయ్ అండ్ సివరేజీ బోర్డు ఔట్సోర్సింగ్ ఉద్యోగులు కలిశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు.
2021లో తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన జీవో 60 ప్రకారం జీహెచ్ఎంసీ ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్‌కు జీతాలు ఇస్తున్నారని, తమకూ అలాగే ఇవ్వాలన్నారు. వాటర్‌బోర్డు ఎండీగా దానకిశోర్ఉన్నప్పుడు రికమెండ్చేసినా ఇప్పటి వరకు ఇవ్వడం లేదన్నారు. ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎన్నో కష్టాలు పడుతూ పని చేస్తున్నారని, వారికి తగిన న్యాయం చేయాలని కోరారు.