గాలి నుంచి తీసిన నీరు: తాగాలంటే సికింద్రాబాద్ పోవాల్సిందే

గాలి నుంచి తీసిన నీరు: తాగాలంటే సికింద్రాబాద్ పోవాల్సిందే

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ప్లాంట్
ప్రారంభించిన రైల్వే జీఎం గజానన్
ఎనిమిది రూపాయలకే లీటర్ బాటిల్
గాలి నుంచి నీళ్లను తీసి ప్రయాణికులకు అందిస్తోంది ఇండియన్ రైల్వే. తొలిసారిగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో అట్మస్పియరిక్ వాటర్ జనరేటర్ ని ఏర్పాటు చేసింది. రోజుకు వెయ్యి లీటర్ల కెపాసిటీతో డెవలప్ చేసిన ఈ ‘మేఘ్ దూత్’ ప్లాంట్ ను గురువారం అందుబాటులోకి తెచ్చింది. లీటర్ వాటర్ కు విత్ బాటిల్ 8 రూపాయలు, లూజ్ గా అయితే 5 రూపాయలు చెల్లిస్తే చాలు.

గాలి నుంచి తీసిన నీరు తాగాలనుందా? అయితే సికిం ద్రాబాద్ రైల్వే స్టేషన్ కు వెళ్లాల్సిందే. వర్షపు నీరు, భూగర్భ జలాలు కాకుండా గాలి నుంచి వచ్చే నీరు ఏంటీ అని ఆశ్చర్య పోతున్నారా? అవును మీరు విన్నది నిజమే. గాలి ద్వారా నీటిని సిద్ధం చేసే అట్మోస్పియరిక్ వాటర్ జనరేటర్ ను దక్షిణ మధ్య రైల్వే తొలిసారిగా సిక్రింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఏర్పాటు చేసింది . గురువారం ఈ వాటర్ స్టోర్ ను ఫ్లాట్ ఫాం నంబర్ వన్ పై లాంఛనంగా ప్రారంభించింది . మేక్ఇన్ ఇండియా స్ఫూర్తితో మైత్రి ఆక్వాటెక్ అనే సంస్థ మేఘ్ దూత్ పేరుతో దీన్ని అభివృద్ధి చేసింది.

గాలి నుంచి నీరు వచ్చే విధానమిదీ
ఇది పూర్తి అధునాతన టెక్నాలజీ తో రూపొందించిన కొత్త విధానం. ఇందులో గాలి నుం చి అంచెలంచెలుగా నీటినిసేకరిస్తారు. గాలిని వడబోసే పద్ధతి ద్వారా ఒక మెషీన్ లోకి గాలి ప్రసరిం చేలా చేస్తారు. ఇలా వచ్చిన గాలిలో ఉండే తేమలో ఉండే కాలుష్యాలను ముందుగా వడబోస్తారు. అలా వడబోసిన గాలి ఒక చల్లని గదిలోకి వెళ్లి ఐస్ మాదిరి గా మారుతుంది . ఇలా ఘనీభవించిన తర్వాత దానిని కరిగించినప్పుడు అది నీరుగా మారి
ఒక్కో బిం దువుగా అక్కడ ఉంచిన పాత్రలో పడుతుంది. ఇలా వచ్చిన నీటిని పూర్తిగా ఫిల్టర్ చేసి అల్ట్రా వయులెట్ సిస్టం ద్వారా స్వచ్ఛంగా మారుస్తారు. ఆ తర్వాత నీటికి కావాల్సిన ఖనిజ లవణాలు కలిపి స్వచ్ఛమైన తాగునీరుగా సిద్ధం చేస్తారు.

భారతీయ రైల్వేలో ఇదే తొలిసారి
పర్యావరణ పరిరక్షణ, ప్రయాణికులకు స్వచ్ఛమైన నీటిని అందించాలన్న లక్ష్యంతో భారతీయ రైల్వేలోనే తొలిసారిగా సికిం ద్రాబాద్ రైల్వే స్టేషన్ లో దీన్ని ఏర్పాటు చేశారు. దేశంలోనే ప్రయోగాత్మకంగా మన వద్ద ఈ వాటర్ ప్లాం ట్ సిద్ధం చేశారు. ఏ సీజన్ లోనైనా సరే నీటికి ఎలాంటి కొరత ఉండదు. కొత్త టెక్నాలజీ రైల్వే స్టేషన్ లో ఏర్పాటు చేసిన సంస్థను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా ప్రశంసించారు. ప్రయాణికుల నుంచి వచ్చే స్పందనను బట్టి త్వరలోనే అన్ని రైల్వే స్టేషన్లలో దీన్ని ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు .

లీటర్ కు 8 రూపాయలు
ఈ గాలి వాటర్ ను లీటర్ బాటిల్ తో సహా అయితే 8 రూపాయలుగా నిర్ణయించారు. బాటిల్ కాకుండా లూజ్ వాటర్ ను కూడా పొందవచ్చు. ఇందుకోసం 5 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. వెండింగ్ మెషీన్ ద్వారా కూడా ఈ వాటర్ ను పొందవచ్చు. ప్రతి రోజు గాలి ద్వారా వెయ్యి లీటర్ల నీటిని సిద్ధం చేయనున్నారు.