గ్రీన్ గా మారిపోయిన నీళ్లు.. ఎందుకంటే..

గ్రీన్ గా మారిపోయిన నీళ్లు.. ఎందుకంటే..

వెనిస్ ప్రధాన కాలువలోని నీరు ఫ్లోరోసెంట్ ఆకుపచ్చగా మారిపోయాయి. ఈ షాకింగ్ విషయాన్ని వీక్షకులు కెమెరాలో బంధించారు. చాలా మంది ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఈ ప్రకాశవంతమైన ఆకుపచ్చ ప్రాంతం రియాల్టో వంతెన నుంచి గ్రాండ్ కెనాల్ భాగం వరకు విస్తరించి ఉంది. ఈ పరిస్థితి మొదట 9:30 am CET (3.30 am ET) సమయంలో గుర్తించబడింది. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పలు ఫొటోలా ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇందులో గొండోలాస్, వాటర్ టాక్సీలు, వాటర్ బస్ బోట్‌లు పచ్చ పదార్థం గుండా వెళుతున్నట్లు చూపించింది.

https://twitter.com/vvfveneto/status/1662815868525461504

దీనికి సంబంధించిన ఓ వీడియోను ఇటలీ అగ్నిమాపక విభాగం తమ ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. ఇందులో ఒక పడవ ఫాస్ఫోరేసెంట్ నీటిలో ప్రయాణించింది. వెనిస్‌లోని అధికారులు, ఫ్లోరోసెంట్ గ్రీన్ వాటర్ పాచ్‌ను పరిశీలిస్తున్నారు. కెనాల్ పర్యావరణ స్థితిని పర్యవేక్షిస్తున్నామని ఇటలీ అగ్నిమాపక దళం తెలిపింది. అయితే ఈ ఆకుపచ్చ నీటి వల్ల వెనిస్‌లోని ప్రజలకు ఆరోగ్యానికి ఎలాంటి ముప్పు లేదని స్థానిక పోలీసులు చెబుతున్నారు.

వెనిస్ గ్రాండ్ కెనాల్ రంగు మార్పు కావడం ఇదేం మొదటిసారి కాదు. 1968లో అర్జెంటీనా కళాకారుడు నికోలస్ గార్సియా ఉరిబురు వార్షిక వెనిస్ బినాలే సందర్భంగా ఫ్లోరోసెసిన్ అనే ఫ్లోరోసెంట్ డైతో కాలువలోని నీళ్లకు ఆకుపచ్చ రంగు వేశారు. పర్యావరణ సమస్యలు, ప్రకృతి, నాగరికత మధ్య సంబంధాన్ని దృష్టికి తీసుకురావడానికి ఈ చర్య రూపొందించబడింది.

https://twitter.com/Feher_Junior/status/1662946146619125760