
గత పాలకుల తప్పిదాల వలన ప్రాజెక్టులు పేకమేడల్లా కూలుతున్నాయని, ఏ ప్రాజెక్టు ఎప్పుడు కూలుతుందో అర్థం కాని పరిస్థితి ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కానీ కాంగ్రెస్ హయాంలో కట్టిన ప్రాజెక్టులు ఇప్పటికీ చెక్కు చెదరడం లేదని తెలిపారు. నీళ్ల కోసం ఎంత పరితపించామో తెలుసని.. తెలంగాణ ప్రజల అతి పెద్ద సెంటిమెంట్ నీళ్లేనని, యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి ప్రతి ఎకరాకు నీళ్లందిస్తామని చెప్పారు.
జలసౌధలో ఏర్పాటు చేసిన కొలువుల జాతర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం.. 400 మంది AE, JTO లకు నియామక పత్రాల అందజేశారు. ఉద్యోగాలు సంపాదించిన అందరికీ అభినందనలు తెలిపిన సీఎం.. ఈ ఉద్యోగాలు నెల నెలా జీతాలు తీసుకునే ఉద్యోగాలు కావని అన్నారు. ఎంపికైన ఉద్యోగులు తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు.
ఉద్యోగాలకు ఎంపికైన వారు వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినవారేనని, రైతులను ఆత్మ గౌరవంతో బతికేలా చూస్తున్నామని చెప్పారు. చిత్తశుద్ధితో పని చేసి తెలంగాణ పునర్నిర్మాణంలో కీలక భాగస్వామ్యం కావాలని సూచించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ కామెంట్స్:
- ప్రజల భావోద్వేగానికి మీరే ప్రతీకలు
- మీ భావోద్వేగాన్ని కొందరు రాజకీయాలకు వాడుకున్నారు
- గత ప్రభుత్వం ప్రాజెక్టులపై రెండు లక్షల కోట్లు ఖర్చు చేసింది
- రెండు లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఎన్ని ఎకరాలకు నీరందించింది
- పదేళ్లలో ప్రాజెక్టులు పూర్తి చేయలేక పోయారని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి.
- తెలంగాణలో ముఖ్యమైన ప్రాజెక్టులు ఎవరు కట్టారు
- వందేండ్లైనా మేము కట్టిన ప్రాజెక్టులు చెక్కు చెదరలేదు
- నెహ్రూ వేసిన పునాదులే నేడు తెలంగాణకు నీళ్లిచ్చే ప్రాజెక్టులు
- శ్రీశైలం, నాగార్జున సాగర్ ఎందుకు చెక్కు చెదరలే
- సాంకేతిక పరిజ్ఞానం లేనప్పుడే నాగార్జున సాగర్ నిర్మించాం
- తెలంగాణలో 22 లక్షల ఎకరాలకు నీరందిస్తున్నాం
- ఎన్ని వరదలు వచ్చినా ఆ ప్రాజెక్టులు తట్టుకుని నిలబడ్డాయి
- కాళేశ్వరం ప్రాజెక్టు మూడేండ్లకే ఎందుకు కూలింది
- కానీ కాళేశ్వరం 50 వేల ఎకరాలకు కూడా నీరందించలేక పోయింది
- మూడేండ్లకే కుప్ప కూలిన ప్రాజెక్టు ప్రపంచంలోనే లేదు
- సమైక్య పాలనలో అన్యాయం జరిగింది .. ప్రాజెక్టులు పూర్తి కాలేదు
- జలయజ్ఞంలో ప్రాజెక్టులు ప్రారంభమైనా గత పదేళ్లలో పూర్తి చేయలేదు
- గత పాలకుల తప్పిదాల వలన ప్రాజెక్టులు పేకమేడల్లా కూలుతున్నాయి
- 75 శాతం పై బడిన ప్రాజెక్టులను పూర్తి చేయాలని నిర్ణయించాం
- ఉదాహరణకు ఎస్ఎల్బీసీ టన్నెల్.. ప్రపంచంలోనే అద్భుత టన్నెల్
- పదేండ్లలో 10 కిలో మీటర్లు కూడా తవ్వకపోవడంతోనే ఇప్పుడు టన్నెల్ కూలిపోయింది
- గ్రావిటీ మీద నల్గొండకు నీరందించే ప్రాజెక్టును గత ప్రభుత్వం పూర్తి చేయలేకపోయింది
- తెలంగాణ సెంటిమెంట్ తో కొందరు లబ్ది పొందారు
- పదేళ్లు ప్రాజెక్టులను పూర్తి చేయలేకపోయారు
- తెలంగాణ ప్రజలకు ఉన్న అతిపెద్ద సెంటిమెంట్ నీళ్లు
- ఈ సెంటిమెంట్ ను జాగ్రత్తగా పూర్తి చేయాలి
- కల్వకుర్తి, భీమా నెట్టెంపాడు, సమ్మక్క సారలమ్మ, దేవాదుల మొదలైన ప్రాజెక్టులను మొదటి ప్రాధాన్యం తీసుకుని పూర్తి చేస్తాం
- గత ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వడం లేదని ధర్నాలు..
- కానీ తమ ప్రభుత్వంలో ఉద్యోగాలు వద్దని ధర్నాలు చేసేలాగా ఇస్తున్నాం
- గ్రూప్ 1 ఉద్యోగులకు నియామక పత్రాలు ఇచ్చే ముందే కొందరు దురుద్దేశంతో అడ్డుకున్నారు
- కోర్టులో కేసు వేసి 563 ఉద్యోగాలు అడ్డుకోవాలని ప్రయత్నం చేశారు
- తొందరల్లోనే ఉద్యోగ నియామకాలు పూర్తి చేస్తాం