
హైదరాబాద్ లంగర్ హౌజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో వాటర్ పైప్ లైన్ పగిలిపోయింది. PVNR ఎక్స్ ప్రెస్ హైవే పిల్లర్ నెంబర్ 53 దగ్గర పైప్ లైన్ లీక్ అయ్యింది. దాంతో భారీ ఎత్తున నీరు ఎగిసి పడింది. రోడ్డుపైకి భారీగా నీరు వచ్చి చేరుతుండటంతో… ఆ ప్రాంతమంతా చెరువులా మారింది. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో పిల్లర్ నెంబర్ 53 దగ్గర భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.
For More News..