ప్రపంచంలోనే అతి ప్రమాదకర ప్రాంతాల్లో జవహర్ నగర్ డంపింగ్ యార్డు ఒకటిగా నిలిచింది. ఇప్పటికే జల కాలుష్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఈ డంపింగ్‌యార్డు ఇప్పుడు మిథేన్వంటి విషవాయువులను అత్యధిక మోతాదులో విడుదల చేస్తున్న డేంజరస్ప్లేస్గా రికార్డుల్లోకి ఎక్కింది. ఇటీవల యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా లాస్ ఏంజిల్స్ ‘స్టాప్ మిథేన్ ప్రాజెక్ట్’ కింద చేపట్టిన పరిశోధనలో భయంకరమైన విషయాలు వెల్లడయ్యాయి.
గ్రౌండ్‌వాటర్, చెరువులు కలుషితం
జవహర్నగర్డంపింగ్యార్డు వల్ల చుట్టుపక్కల గ్రౌండ్‌వాటర్ పొల్యూట్అయ్యింది. 10 కిలోమీటర్ల మేర భూమి లోపల నీళ్లు కలుషితమయ్యాయని రిపోర్టులు చెబుతున్నాయి. ఇక్కడి నీటి టీడీఎస్ చెక్ చేస్తే 4 వేలకు పైగా ఉంది. ఈ నీటితో స్నానం చేస్తున్న వారికి చర్మ సంబంధిత వ్యాధులు, ఇన్ఫెక్షన్లు వస్తున్నాయి. ఈ నీటిని వాడిని కొందరి కిడ్నీలు కూడా ఫెయిలయ్యాయి. ఇక్కడి చెత్త నుంచి విద్యుత్‌ఉత్పత్తి చేయడానికి 2023 ఏప్రిల్ 15న రూ.251 కోట్లతో 2వేల కేఎల్డీ సామర్థ్యం గల లీచెట్ ట్రీట్ మెంట్ ప్లాంట్ ను అప్పటి బీఆర్ఎస్ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ విద్యుత్‌ఉత్పత్తి ప్రక్రియ వల్ల విపరీతమైన వాయు కాలుష్యం ఏర్పడుతోందని పలు స్టడీ రిపోర్టులు వెల్లడించాయి. ప్లాంట్ నుంచి వచ్చే లీచెట్ తో చుట్టుపక్కల చెరువులు పూర్తిగా కలుషితమయ్యాయి. దుర్గంధం వెదజల్లుతోంది. దమ్మాయిగూడ, నాగారం ప్రాంతాల్లోని కాలనీల్లో డంపింగ్ యార్డు నుంచి వచ్చే నీటితో వాటర్ పొల్యూషన్ అవుతుంది.
అసలేంటీ యూసీఎల్ఏ?
యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా, లాస్ఏంజెల్స్(యూసీఎల్ఏ) అనేది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఒక ప్రభుత్వ పరిశోధన విశ్వవిద్యాలయం. ఇది ప్రపంచంలోని అత్యుత్తమ విశ్వవిద్యాలయాలలో ఒకటి. ఈ యూనివర్సిటీ చదువే కాకుండా సమాజానికి ఉపయోగపడే కొత్త విషయాలను కనుక్కుంటుంది. పర్యావరణం, హెల్త్, టెక్నాలజీ, స్పేస్వంటి రంగాల్లో లోతైన పరిశోధనలు చేస్తుంది. వాతావరణ మార్పులు, వాయు కాలుష్యం, గ్లోబల్ వార్మింగ్‌కు కారణమయ్యే మిథేన్ వంటి వాయువుల ప్రభావంపై స్టడీ చేస్తూ ప్రభుత్వాలకు పలు సూచనలు ఇస్తూ ఉంటుంది. ఇందులో భాగంగా వీరు 2025లో ‘స్టాప్ మిథేన్ ప్రాజెక్ట్’ చేపట్టారు. ఇందు కోసం వీరు శాటిలైట్ల ద్వారా సేకరించిన డేటాను విశ్లేషించారు.

