హైదరాబాద్ : ఆగస్టు 6న ఈ ప్రాంతాల్లో వాటర్ బంద్

హైదరాబాద్ :   ఆగస్టు 6న ఈ ప్రాంతాల్లో వాటర్ బంద్

హైదరాబాద్ సిటీ, వెలుగు: లింగంపల్లి నుంచి సనత్‌‌నగర్ రిజర్వాయర్ వరకు నీటి సరఫరా చేసే పైపులైన్‌‌ కు జంక్షన్ ప‌‌నులు చేపట్టనున్న దృష్ట్యా బుధవారం వివిధ ప్రాంతాల్లో నీటి సరఫరా ఉండదని వాటర్​బోర్డు అధికారులు తెలిపారు. 

ఓఅండ్ఎం డివిజన్​–9 పరిధిలోని రాజీవ్ గాంధీ నగర్, ఎన్‌‌టీఆర్ నగర్, శ్రీశ్రీ నగర్, ప్రశాంత్ నగర్, దీన్​దయాళ్​నగర్, జింకలవాడ , ప్రభాకర్ రెడ్డి నగర్, సమతానగర్, వెంకటేశ్వర నగర్, కార్మికనగర్, శివశంకర్ నగర్, ఎల్‌‌బీఎస్ నగర్, ఫతే నగర్, చరబండ రాజు కాలనీ, బాలానగర్, జనతా నగర్, చైతన్య బస్తీ, వడ్డర్ బస్తీ, ఎరుకల్ బస్తీ, శాస్త్రీ మార్గం, జిల్లా బస్తీ, శ్రీరాంకాలనీ, 15వ ఫేజ్, కైత్లాపూర్, రాఘవేంద్ర కాలనీ, హనుమాన్ చౌక్, యాదవ్ బస్తీ, హెచ్‌‌పీ రోడ్, భవానీ నగర్, సర్దార్ పటేల్ నగర్, గుడ్ షేడ్ రోడ్, జేపీనగర్ ఈడబ్ల్యూఎస్, ఎంఐజీ, హెచ్ఐజీ, ఎల్ఐజీ , సత్య సాయి నగర్, ఓ అండ్ ఎం డివిజన్-–6  పరిధిలోని డీఎన్ఎం కాలనీ, అశోక్ కాలనీ, అల్లావుద్దీన్ కోఠి, బీజేఆర్​నగర్, రేణుకానగర్, సుప్రభాత్ నగర్, నీమ్‌‌కర్ నగర్ తదితర ప్రాంతాల్లో నీటి సరఫరా ఉండదన్నారు.