
హైదరాబాద్ సిటీ, వెలుగు: నగరానికి తాగునీరు సరఫరా చేసే మంజీరా ఫేజ్–-2కు సంబంధించి కలబ్ గూర్ నుంచి హైదర్ నగర్ వరకు ఉన్న 1500 ఎంఎం డయా పీఎస్సీ పంపింగ్ మెయిన్ కు వివిధ ప్రాంతాల్లో భారీ లీకేజీలు ఏర్పడ్డాయి. ఈ లీకేజీలను అరికట్టేందుకు ఈ నెల 24 బుధవారం ఉదయం 6 గంటల నుంచి మరుసటిరోజు అనగా 25వ తేదీ గురువారం ఉదయం 6 గంటల వరకు మరమ్మతు పనులు చేపట్టనున్నారు.
ఈ కారణంగా 24న ఆర్సీ పురం, అశోక్ నగర్, జ్యోతి నగర్, లింగంపల్లి, చందానగర్, గంగారం, మదీనాగూడ, మియాపూర్. బీరంగూడ, అమీన్ పూర్, ఆఫ్ టేక్ పాయింట్స్, బల్క్ కనెక్షన్లు, ఎర్రగడ్డ, ఎస్ఆర్ నగర్, అమీర్ పేట, కేపీహెచ్ బీ కాలనీ, కూకట్ పల్లి, భాగ్యనగర్ కాలనీ ప్రగతి నగర్ నీటి సరఫరా ఉండదని అధికారులు తెలిపారు.