
హైదరాబాద్ సిటీ, వెలుగు: సినీ నటుడు నిఖిల్ సినిమా షూటింగ్ లో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ది ఇండియన్ హౌస్ సినిమా కోసం శంషాబాద్ సమీపంలో సముద్రం సీన్స్ తీసేందుకు భారీ వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేశారు. ప్రమాదవశాత్తు ట్యాంక్ పగిలిపోవడంతో పెద్దమొత్తంలో వరద షూటింగ్లొకేషన్లోకి వచ్చింది.
ఈ ఘటనలో అసిస్టెంట్ కెమెరామన్ కు తీవ్ర గాయాలు కాగా, మరికొంత మందికి గాయాలైనట్లు సమాచారం. భారీగా ఆర్థిక నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది.