స్మారక కేంద్రాలు వివిధ సంస్థలకు దత్తత ఇస్తున్నాం

స్మారక కేంద్రాలు వివిధ సంస్థలకు దత్తత ఇస్తున్నాం
  • పర్యాటక ప్రాంతాల్లో సదుపాయాలు పెంపొందిస్తాం
  • విదేశాల కంటే మంచి పర్యాటక కేంద్రాలు దేశంలో చాలా ఉన్నాయి
  • టూరిజం అభివృద్ధికి కేంద్రం సహకారం ఇస్తుంది
  • కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి

హైదరాబాద్: ప్రాచీన స్మారక కేంద్రాలు వివిధ సంస్థలకు దత్తత ఇవ్వాలని కేంద్రం ప్రభుత్వం నిర్ణయించిందని.. దేశ వ్యాప్తంగా వెయ్యి స్మారక ప్రాంతాలను దత్తత ఇవ్వబోతున్నామని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి వెల్లడించారు. విదేశాల కంటే మంచి పర్యాటక కేంద్రాలు దేశంలో చాలా ఉన్నాయని, పర్యాటక ప్రాంతాల్లో సదుపాయాలు పెంపొందిస్తామని ఆయన తెలిపారు. శనివారం క్రిస్మస్ సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్ లో భాగ్య నగర్ వైశ్య యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హాట్ ఎయిర్ బెలూన్ ఫియెస్టా కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. పరేడ్ గ్రౌండ్ లో రెండు రోజుల పాటు జరగనున్న హాట్ ఎయిర్ బెలూన్ ఫియెస్టాను ప్రారంభించిన ఆయన హాట్ ఎయిర్ బెలూన్ రైడ్ చేశారు. 
ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ లో ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం శుభ పరిణామం అన్నారు. తెలంగాణలో టూరిజం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరిస్తుందన్నారు. గత రెండేళ్లుగా కరోనా వల్ల దేశంలో టూరిజం కార్యక్రమాలు చాలా వరకు ఆగిపోయాయని, ప్రపంచ వ్యాప్తంగా కరోనా వల్ల టూరిజం నష్టపోయిందని గుర్తు చేశారు. మన దేశంలో టూరిజం అభివృద్ధి చేసుకోవడానికి స్కోప్ ఎక్కువగా ఉందని, ఉత్తర భారతదేశంలోని రాష్ట్రాల్లో న్యూజిలాండ్ దేశంలోని పర్యాటక ప్రాంతాలకంటే దీటైన మంచి ప్రదేశాలు చాలా ఉన్నాయన్నారు. పర్యాటక ప్రాంతాల్లో  సరైన సదుపాయాలు కల్పిస్తామన్నారు. దేశంలో ఉన్న వెయ్యి స్మారక కట్టడాలను వివిధ సంస్థలు ఆడాప్ట్ చేసుకోవడానికి ఇస్తున్నామన్నారు. రామప్ప యునెస్కో గుర్తింపు పొందిందని, పోచంపల్లి ని బెస్ట్ టూరిజం విలేజ్ కింద యునెస్కో గుర్తించిందన్నారు. పోచంపల్లి లో ఫిబ్రవరి 25 న టూరిజం డే సందర్భంగా వివిధ కార్యక్రమాలు చేస్తామన్నారు. 
తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మైన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ హాట్ ఎయిర్ బెలూన్ రైడ్ యూత్ ని అట్రాక్టు చేస్తోందన్నారు. మహిళలు కూడా వచ్చి హాట్ ఎయిర్ బెలూన్ రైడ్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నారని తెలిపారు. ప్రతీ జిల్లాలో ఇలాంటి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో టూరిజం ని డెవలప్ చేయడానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సహకారం తీసుకుంటున్నామని, యాదాద్రి టెంపుల్ ని 14 వందల కోట్లతో మరో తిరుమల లాగా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందన్నారు. విదేశీ, స్వదేశీ పర్యాటకులు రాష్ట్రానికి వచ్చేలా కృషి చేస్తున్నామని వివరించారు.

 

ఇవి కూడా చదవండి

ట్రిమ్మర్ లో బంగారం.. ఎయిర్ పోర్టులో అడ్డంగా దొరికాడు

జనవరి 2 వరకు ర్యాలీలు, సభలు బంద్