కేసీఆర్ ఉద్యోగులకు చేస్తున్న అన్యాయంపై చర్చకు సిద్ధం

కేసీఆర్ ఉద్యోగులకు చేస్తున్న అన్యాయంపై చర్చకు సిద్ధం
  • బీజేపీ జాతీయ నాయకులు మురళీధర్ రావు

హైదరాబాద్: కేసీఆర్ ప్రభుత్వానికి పక్షపాతం వచ్చింది… పనితీరు మూర్ఛ వచ్చినట్లుగా ఉందంటూ బీజేపీ జాతీయ నాయకులు మురళీధర్ రావు ధ్వజమెత్తారు. బీజేపీ ఆఫీస్‌లో ఏర్పాటు చేసిన ప్మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగులకు చేస్తున్న అన్యాయం పై చర్చకు సిద్ధమని ప్రకటించారు. ‘‘ 1974 లో పీఆర్సీ  ఐదు శాతం ఫిట్ మెంట్ ప్రతిపాదించారు.. ఇప్పటి వరకూ అలాంటి పరిస్థితి రాలేదు.. కానీ ఇప్పుడు మాత్రం 7.5% ఫిట్ మెంట్ ను ప్రతిపాదించారు..’’ అని  చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులనే కాపాడుకోలేని ప్రభుత్వం ఇదేం  ప్రభుత్వమని ఆయన ఎద్దేవా చేశారు. ఉద్యోగులను దోచుకోవడం ప్రభుత్వానికి మహా పాపం.. దుర్మార్గం.. ఉద్యోగుల కడుపుకొట్టే మాదిరిగా కేసీఆర్ ప్రభుత్వం వ్యవరిస్తున్నది.. ఉద్యోగులకు అన్యాయం చేస్తే పాపం తగులుతుందని ఆయన పేర్కొన్నారు.

ప్రభుత్వ ఉద్యోగుల హెచ్ఆర్ఏను తగ్గించడం ఏంటి?

కరోనా తో ఇండ్ల కిరాయిలు తగ్గినయ్.. మీరు హెచ్ఆర్ఏ స్లాబ్ ల ను ఎలా తగ్గిస్తారు? అని మురళీధర్ రావు ప్రశ్నించారు. మిట్ట మధ్యాహ్నం పీఆర్సీ కమిషన్ ఉద్యోగులను అత్యాచారం చేసింది.. విద్యుత్ ఉద్యోగులకు ఒక మాదిరిగా టీచర్లకు, ఉద్యోగులకు ఒక మాదిరిగా పీఆర్సీ ఇవ్వడం ఏంటి? అని నిలదీశారు. విద్యుత్ ఉద్యోగులకు ఇచ్చినట్లుగానే ఉద్యోగులకు కూడా పీఆర్సీ  ప్రకటించాలని డిమాండ్ చేశారు.

పార్లమెంటు సమావేశాలను 16 పార్టీలు బహిష్కరించడం పార్లమెంటు ను కించపరచడమే

పార్లమెంటు లో చట్టం చేసిన తరవాత చరిత్ర లో 11 సార్లు  ఒక అంశంపై చర్చలు జరిపినము.. అయినా పార్లమెంటు సమావేశాలను 16 పార్టీలు బహిష్కరించడం పార్లమెంటును కించపరచడమేనని బీజేపీ జాతీయ నాయకులు మురళీధర్ రావు పేర్కొన్నారు. ఢీల్లీలో కిసాన్ ర్యాలీకి ప్రజాస్వామ్య పద్ధతిలో అనుమతి ఇచ్చామని.. కానీ ఢిల్లీలో హింసకు పరిస్థితులు దారి దారి తీశాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇందులో కాంగ్రెస్ పార్టీ కుట్ర ఉందని ఆయన ఆరోపించారు. రామ మందిరం విషయం లో అన్ని వర్గాల వారు విరాళాలు ఇస్తున్నారు, టీఆర్ఎస్ నేతలు కూడా ఇస్తున్నారు.. రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదని ఆయన పేర్కొన్నారు.