ధాన్యం కొనుగోలు కేంద్రాల‌ ప‌రిస్థితిని స‌మీక్షిస్తున్నాం

ధాన్యం కొనుగోలు కేంద్రాల‌ ప‌రిస్థితిని స‌మీక్షిస్తున్నాం

కరీంనగర్ జిల్లా: మొక్కజొన్నలు, వడ్ల కొనుగోలు కేంద్రాల్లో పరిస్థితిని ఎప్పటికప్పడు సమీక్షిస్తున్నామ‌న్నారు మంత్రి ఈట‌ల రాజేంద‌ర్. రైతులకు ఇబ్బంది కలగకుండా, అకాల వర్షాలకు పంటలు తడవకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చామ‌న్నారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ప్రతి గింజను కొనుగోలు చేయమని అధికారులకు ప్రతిరోజు ఆదేశాలు ఇస్తున్నామ‌న్నారు. ఊహించని రీతిలో ఈసారి మొక్క జొన్న పంట వచ్చిందని.. దీంతో స్టోరేజ్ గోదాములు సరిపోక స్నేహ ఫీడ్స్ వారి 22 వేల మెట్రిక్ టన్నుల స్టోరేజ్ కేంద్రాన్ని మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో లీజుకు తీసుకున్నామ‌ని చెప్పారు. మొక్కజొన్నల్లో బెండ్లు, రాళ్లు, నల్ల గింజలు లేకుండా నిఖార్సయిన పంటనే మార్కెట్ కు తీసుకు రావాలన్నారు.

వరి ధాన్యం కేంద్రంలో కూడా తాలు, చెత్త లేకుండా తీసుకు రావాలని.. రైతులు మేలైన, నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకు వస్తే కిలో ధాన్యం కూడా కటింగ్ ఉండదన్నారు. 100కిలోల వరిధాన్యంలో 60కిలోల బియ్యం మాత్రమే వస్తున్నాయని రైస్ మిల్లర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు చేసిన వరి ధాన్యాన్ని మిల్లర్లు వెంటవెంటనే దిగుమతి చేసుకుని ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. వడగండ్ల వానకు ధాన్యం తడిచే ప్రమాదమున్నందున స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులతో సమన్వయం చేసుకొని కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకరావాలన్నారు మంత్రి ఈటెల రాజేంద‌ర్.