- ఎన్నికల సర్వేలన్నీ బూటకం
- జేడీఎస్ మద్దతు లేకుండానే ప్రభుత్వం ఏర్పాటు చేస్తం
శిగ్గావ్: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ బీజేపీనే గెలుస్తుందని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ధీమా వ్యక్తం చేశారు. సులభంగా పూర్తి మెజారిటీ సాధించి అధికారాన్ని నిలబెట్టుకుంటామని ఆయన పేర్కొన్నారు. విజయావకాశాలు కాంగ్రెస్ కే ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్న సర్వేలను బూటకంగా ఆయన అభివర్ణించారు. కాంగ్రెస్ అసలు గెలిచే చాన్సే లేదన్నారు. శుక్రవారం ఓ వార్తా సంస్థతో బొమ్మై మాట్లాడారు. బీజేపీ గెలిస్తే సీఎంగా ఎవరు ఉండాలో పార్టీ హైకమాండ్, పార్టీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయిస్తాయని తెలిపారు. పలువురు సీఎం రేసులో ఉన్నారని చెప్పారు. టికెట్ రాకపోవడంతో కాంగ్రెస్ లో చేరిన మాజీ సీఎం జగదీశ్ శెట్టర్ ఈసారి హుబ్లీ–ధార్వాడ్ సెంట్రల్ నుంచి ఓడిపోతారని అన్నారు. ఇతర పార్టీల నుంచి 2019లో బీజేపీలో చేరినవారు తమ సెగ్మెంట్లలో విజయం సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
శెట్టర్ ప్రభావం ఏమీ ఉండదు
టికెట్ రాకపోవడంతో బీజేపీని వీడి కాంగ్రెస్ లోకి చేరిన మాజీ సీఎం, లింగాయత్ లీడర్ జగదీశ్ శెట్టర్ ప్రభావం తమ పార్టీ గెలుపు అవకాశాలపై ఉండదని బొమ్మై అన్నారు. ‘‘రాష్ట్రంలో 17% ఉన్న లింగాయత్‌లు మాకే ఓటేస్తారు. శెట్టర్ బీజేపీని వీడినా లింగాయత్‌లు మాకే మద్దతు తెలుపుతున్నారు. ఈసారి మేము పూర్తి మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తం. జేడీఎస్
అవసరం కూడా మాకు రాకపోవచ్చు.
