
యూపీలోని బరేలీలో ఐ లవ్ మహమ్మద్ ర్యాలీ క్రమంలో చెలరేగిన ఆల్లర్లపై యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదని స్ట్రాంగ్ వార్నింగ్ఇచ్చారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
శుక్రవారం బరేలీలో ప్రార్థనల అనంతరం ఐ లవ్ మహమ్మద్ ర్యాలీ నిర్వహించి అల్లర్లకు కారణమైన వారికి స్ట్రాంగ్ వార్నింగ్ఇచ్చారు. కులం పేరుతో విధ్వంసం సృష్టించాలని చూసేవారికోసమే బుల్డోజర్లు తెచ్చామని అన్నారాయన.
ఐ లవ్ ముహమ్మద్ ప్రచారానికి మద్దతుగా మొదట నిరసనకు పిలుపునిచ్చిన ఇత్తెహాద్- ఎ -మిల్లత్ కౌన్సిల్ చీఫ్ మతాధికారి తౌకీర్ రజా ఖాన్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.
సిఎం యోగి ఏమన్నాడంటే..
పండగల సమయంలో అల్లర్లు సృష్టించడం అలవాటు అయిపోయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా విధ్వంసం సృష్టించాలనుకునేవారికి ఏడు తరాలకు గుర్తిండిపోయేలా గుణపాఠం చెబుతామని అన్నారు సీఎం యోగి. ఇలాంటి వారి బుద్దిని మార్చుకోకపోతే సరిదిద్దేందుకు వారికి డెంటింట్ అండ్ పెయింటింగ్ చేయాల్సి ఉంటుంది. నిన్న బరేలీలో ఈ డెంటింగ్ అండ్ పెయింటింగ్ చూశారు అని అన్నారుసీఎం యోగి.