నిర‌న‌స సెగ ఢిల్లీకి తాకాల‌నే రాస్తారోకోకు పిలుపునిచ్చాం

నిర‌న‌స సెగ ఢిల్లీకి తాకాల‌నే రాస్తారోకోకు పిలుపునిచ్చాం
  • కేంద్ర ప్ర‌భుత్వంతో తాడోపేడో తేల్చుకుంటాం

నిర్మల్ జిల్లా: ‘ధాన్యం కొనేదాక బీజేపీ స‌ర్కారుతో కొట్లాడుతాం.. కేంద్ర ప్రభుత్వం దిగొచ్చేదాక పోరాటం ఆగదు..కేంద్ర ప్ర‌భుత్వంతో తాడోపేడో తేల్చుకుంటాం..’ అని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. కడ్తాల్ వై జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై టి.ఆర్.ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పాల్గొన్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో పండించిన వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం బేషరతుగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. వరి వేయండి.. వడ్లను మేం కొనిపిస్తామ‌న్న బీజేపీ నాయ‌కులు మోహం చాటేస్తున్నారని ఆరోపించారు. గ్రామ‌ గ్రామాన బీజేపీ నాయ‌కుల‌ను నిల‌దీయాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కోరారు. అన్న‌దాత‌ల ప్ర‌యోజ‌నం కోస‌మే మా పోరాటమని..ర‌హ‌దారిపై బైఠాయించి ప్ర‌జ‌ల‌ను ఇబ్బందులు పెట్టాల‌నే ఉద్దేశ్యం మాకు లేదని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. నిర‌న‌స సెగ ఢిల్లీకి తాకాల‌నే రాస్తారోకో కు పిలుపునిచ్చామన్నారు. 

 

 

ఇవి కూడా చదవండి

కేటీఆర్ ట్వీట్ చేస్తేనే పోలీసులు కేసు బుక్ చేస్తారా ? 

షాంఘైలో కరోనా కలకలం.. లాక్డౌన్ పెట్టినా తగ్గని కేసులు

పోలీసులతో దురుసుగా ప్రవర్తించిన ఎంఐఎం కార్పొరేటర్ అరెస్ట్

ఆడపిల్ల పుట్టిందని సంబురాలు.. హెలికాప్టర్లో ఇంటికి