V6 News

మమ్మల్ని భయపెట్టలేరు.. అమెరికాకు ఇరాన్ కౌంటర్

మమ్మల్ని భయపెట్టలేరు.. అమెరికాకు ఇరాన్ కౌంటర్

టెహ్రాన్: అమెరికా తన మిలిటరీని మోహరించి యుద్ధం పేరుతో చేస్తున్న బెదిరింపులకు తాము భయపడబోమని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ స్పష్టం చేశారు. ఆదివారం టెహ్రాన్‎లో ఆయన మీడియాతో మాట్లాడారు. బెదిరింపులతో తమ అణు కార్యక్రమాన్ని ఎవరూ ఆపలేరని అన్నారు. 

అమెరికాతో ఒమన్ మధ్యవర్తిత్వంలో కొనసాగుతున్న చర్చలపై స్పందిస్తూ.. దీనిపై తమ వ్యూహాత్మక భాగస్వాములైన చైనా, రష్యాతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. అయితే, అమెరికాపై తమకు పెద్దగా నమ్మకం లేదని, చర్చలపై ఆ దేశం సీరియస్ గా ఉన్నట్టు కనపడటంలేదన్నారు.