మూడేళ్లలో రీజనల్ రింగ్ రోడ్డు పూర్తి చేస్తాం : మంత్రి కోమటిరెడ్డి

మూడేళ్లలో రీజనల్ రింగ్ రోడ్డు  పూర్తి చేస్తాం : మంత్రి కోమటిరెడ్డి

తెలంగాణలో ఓటు షేర్ పెంచుకున్నాని సుస్థిర పాలన అందిస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. 2018 నుంచి రీజనల్ రింగ్ రోడ్ పై చర్చ జరుగుతుంది కానీ ముందుకు కదలడం లేదని చెప్పారు. తమ ప్రభుత్వం వచ్చాక రీజనల్ రింగ్ రోడ్ ఎన్నికల కోడ్ వల్ల ఆలస్యం అయ్యిందని తెలిపారు. హైదరాబాద్ విజయవాడ రహదారిని 6 లైన్ల రహదారిగా మర్చాలని రోజుకి 60 వేల వాహనాలు తిరుగుతాయని చెప్పారు. 

17 ప్రమాద జోన్లను గుర్తించామని తెలిపారు. త్వరగా హైదరాబాద్ - విజయవాడ రహదారిని 6 లైన్ల రహదారి పనులు చేపట్టాలని కోరామని అన్నారు. రీజనల్ రింగ్ రోడ్డు కోసం ప్రత్యేక సమావేశం పెడతామని చెప్పారని తెలిపారు మంత్రి. 16 రోడ్లు పెండింగ్ లో ఉన్నాయని నూతన జాతీయ రహదారుల కోసం మరో సమావేశం ఏర్పాటు చేస్తామని వెల్లడించారని అన్నారు. 

ఉప్పల్ - ఘాట్ కేసర్ ఫ్లయ్ ఓవర్ టెండర్లు రద్దు చేసి కొత్త టెండర్లు పిలవాలని అధికారులకు నితిన్ గడ్కరీ ఆదేశాలు జారీ చేశారని అన్నారు. రేపు కిషన్ రెడ్డిని కలుస్తానని తెలిపారు.  వచ్చే మూడేళ్లలో రీజనల్ రింగ్ రోడ్డు, విజయవాడ - హైదరాబాద్ 6 లైన్ల రహదారిని పూర్తి చేస్తామని చెప్పారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.