
హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన అప్సర హత్యకేసుపై నిందితుడు సాయికృష్ణ తండ్రి మీడియాతో మాట్లాడారు. అసలు అప్సర ఎవరో తమకు తెలియదన్నారు. అప్సరతో మాకు ఏరకమైన బంధుత్వమూ లేదని చెప్పారు. తన కొడుకు వ్యక్తిత్వం చాలా మంచిదని సాయికృష్ణ తండ్రి.. అందరితో సాన్నిహిత్యంగా ఉంటాడని తెలిపారు. అప్సరని ఒకసారి గుడిలో చూసినట్లుగా సాయికృష్ణ తండ్రి తెలిపారు. వారిద్దరి మధ్య సంబంధం ఉందన్న విషయం తనకు తెలియదన్నారు.
తన కొడుకును అప్సర అన్నయ్య అని పిలేచేదని చెప్పారు సాయికృష్ణ తండ్రి. అన్నా అని పిలిచి పెళ్లి చేసుకోమంటే ఎలా.. ఎక్కడైనా ఇలా ఉందా అని ప్రశ్ని్ంచారు. అమ్మాయిల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని తన కొడుకు సాయికృష్ణకు తాను చాలా సార్లు చెప్పానని అన్నారు.
అమ్మాయిని చంపడం తప్పేనని, తాము కూడా సానుభూతి తెలుపుతున్నామని సాయికృష్ణ తండ్రి అన్నారు. సరూర్ నగర్ ప్రాంతానికి చెందిన వెంకటసాయి సూర్యకృష్ణ వృత్తి రీత్యా పూజారి. ఆయనకు భార్య ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయినా వేరే మహిళతో ఏర్పడిన వివాహేతర సంబంధం చిక్కుల్లో పడేసిందని తెలుస్తోంది.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. సాయికృష్ణకి అప్సర అనే యువతికి పరిచయం ఏర్పడింది. నిత్యం గుడికి వస్తుండటంతో సాయికృష్ణకి అప్సరకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. . ఈ క్రమంలో అప్సర తనను పెళ్లి చేసుకోవాలని సాయికృష్ణపై ఒత్తిడి తీసుకువచ్చింది. ఇద్దరు పిల్లలు ఉన్న వెంకటసాయి ఆమెను వదలించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశాడు. కానీ ఆమె పెళ్లి చేసుకోవాల్సిందే అని పట్టుబట్టడంతో చివరకు ఆమెను హతమార్చాడు.