డబుల్ ఇండ్లు మేం కట్టినం..ఈటల కట్టలేదు: తలసాని

డబుల్ ఇండ్లు మేం కట్టినం..ఈటల కట్టలేదు: తలసాని

కరీంనగర్ జిల్లా: డబులు ఇండ్లు మేం కట్టినం.. ఈటల కట్టలేదు అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. హుజురాబాద్  మండలం సింగాపూర్ గ్రామంలో సహచర మంత్రి గంగుల కమలాకర్ తో కలసి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ కేసీఆర్ తో ఈటలకు  విభేదాలు ఉంటే ఇన్ని రోజులు ఎందుకు ఉన్నాడని ప్రశ్నించారు. గడిచిన ఏడేళ్లలో  సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ లో ఊహించని అభివృద్ధి జరిగిందని, అయితే ప్రతిదానిని హుజురాబాద్ ఎన్నికలకు లింక్ పెడుతున్నాయి ఒకటి రెండు పత్రికలని అసహనం వ్యక్తం చేశారు. దళిత బంధు, గొర్రెల పంపిణీ ఒక హుజురాబాద్ కి సంబంధించినవి మాత్రమే కావన్నారు. ఓట్ల కోసం, సానుభూతి కోసం ఏది పడితే అది మాట్లాడొద్దు.. గడచిన 7 ఏండ్లు ఈటలకు ఆత్మగౌరవం  ఎందుకు లేదు అని ప్రశ్నించారు.  హుజురాబాద్ లో ఒక  డబుల్ బెడ్ రూం ఇల్లు కట్టకపోవడం ఈటల ఫెయిల్యూర్.. రైతు బంధు నువ్ తీసుకున్నవ్ కదా.. ఎందుకు వెనక్కి ఇవ్వలేదని ప్రశ్నించారు. పల్లెలు పట్టణాలు తేడా లేకుండ భూ విలువ పెరిగింది కేసీఆర్ పాలనతోనేనని, ఈటల గెలిస్తే ప్రజలకు ఎలాంటి మేలు జరుగదన్నారు. గొర్రెలు యూనిట్ ధర అదనంగా మరో 50 వేలు హుజురాబాద్ ఎన్నిక కోసం పెంచలేదని పేర్కొన్నారు. నువ్వు ఒకనివి గెలిచి ఏం సాధిస్తావ్.. అధికారులో ఉండేది మేమేనని మంత్రి తలసాని ధీమా వ్యక్తం చేశారు. గడియారాలు, కుట్టుమిషన్లు ఎందుకు పంచుతున్నావు..?  నీ ఆత్మ గౌరవం ఇదేనా.. ? ప్రభుత్వ పరంగా ఏ గౌరవం దక్కాలో అన్నీ ఈటలకు దక్కాయని.. 
ఇప్పుడు పాదయాత్ర ఎందుకు? చేస్తున్నట్లు అని ప్రశ్నించారు. హుజురాబాద్ అభివృద్ధి కి కేసీఆర్ అడ్డురాలేదు కదా? నువ్వు ఎందుకు చేయలేదన్నారు.  రెచ్చగొట్టే బూతు మాటలు బంద్ చేయాలి,  మీకంటే ఎక్కువ మాట్లాడుతo, గెలుపు ఓటమి సహజం,   సానుభూతి కోసం చీప్ ట్రిక్స్ చేయద్దు అని మంత్రి తలసాని సూచించారు. సీఎం డ్రీమ్ తెలంగాణ అభివృద్ధి, ఏ కార్యక్రమం స్టార్ట్ చేసినా హుజురాబాద్ ఎన్నికకు లింక్ పెడతారా..?  ఇదేనా మీ నీతి..? బాధ్యత గా మాట్లాడటం నేర్చుకో.. ఏడేండ్ల నుంచి కేసీఆర్ గురించి గొప్పగా చెప్పిన ఈటల.. ఇపుడు ఆయన నాలిక ఎందుకు మర్లుతోంది.. ఆశలు పెరిగిపోయిన ఈటలకు ఇది  స్వయంకృతాపరాధం అన్నారు. డబుల్ బెడ్ రూం ఇండ్లు మేము కట్టాం కదా ఎందుకు నువ్ కట్టలేకపోయావ్.. సానుభూతి కోసం దొంగ ఏడుపు అని ఎద్దేవా చేశారు. సీఎం తెలంగాణ కి రక్ష,  హుజురాబాద్ లో టీఆర్ఎస్  అభ్యర్థిని గెలిపించుకుంటామన్నారు. ఏనాడైనా బడుగు బలహీన వర్గాల కోసం మాట్లాడినవా? బీజేపీ లో ఉన్నోడు ఈ దేశంలో ఎవడు బాగుపడడు, కాంగ్రెస్  వాళ్లను ఈ దేశంలో ఎవడు కాపాడలేడు, తెలివి తేటలు కాంగ్రెస్ వాళ్లకు ఉంటే రాష్ట్రం ఎపుడో బాగుపడు,  హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ని నెరవేర్చాం, విబేధాలు ఉన్నపుడే  ఈటల ఎందుకు బయటకు వెళ్లలేదు అని ప్రశ్నించారు. ఆయనను ఎవరు బయటకు పంపలేదని, నువ్ అనడం  తెలంగాణలో  సహజం.. కొడకా , బిడ్డా ఆనం మేము.. నీలాగా అని మంత్రి తలసాని పేర్కొన్నారు.