గత మూడేండ్లలో తెలంగాణకు 3,073 కోట్లు ఇచ్చాం : లోక్‌‌సభలో కేంద్రం వెల్లడి

 గత మూడేండ్లలో  తెలంగాణకు 3,073 కోట్లు ఇచ్చాం : లోక్‌‌సభలో కేంద్రం వెల్లడి

న్యూఢిల్లీ, వెలుగు :  గత మూడేండ్లలో తెలంగాణకు రూ.3,073 కోట్లు ఇచ్చామని కేంద్రం వెల్లడించింది. ‘స్కీం ఫర్ స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఎక్సెపెండే చర్’ కింద ఈ నిధులు కేటాయించామని చెప్పింది. సోమవారం లోక్‌‌సభలో ఎంపీలు గజానన్ కీర్తికర్, కృపాల్ బాలజీలు తుమానే అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సమాధానం ఇచ్చారు.

గత ఐదేండ్లలో ఏ రాష్ట్రానికి ప్రత్యే క ప్యాకేజీ ఇవ్వలేదని, కరోనా నేప థ్యంలో రాష్ట్రాలకు ప్రత్యేక ఆర్థిక సాయం ఇచ్చినట్లు చెప్పారు. ఈ స్కీమ్ కింద తెలంగాణ రాష్ట్రానికి 2020–21లో రూ.358 కోట్లు, 2021–22లో రూ.214.14 కోట్లు, 2022–23లో రూ.2,500.98 కోట్లు విడుదల చేశామని వెల్లడించారు. అలాగే ఏపీకి 2022–23లో రూ.6,105.56 కోట్లు కేంద్రం విడుదల చేసిందని తెలిపారు.