దేశ రాజకీయాల్లో మాకు ప్రతిపక్షం లేకుండా పోయింది : జగదీశ్ రెడ్డి

దేశ రాజకీయాల్లో మాకు ప్రతిపక్షం లేకుండా పోయింది : జగదీశ్ రెడ్డి

నల్లగొండ జిల్లా : గుర్రంపూడ్ మండల కేంద్రంలో ఎమ్మెల్యే నోముల భగత్ ఆధ్వర్యంలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం మంత్రి జగదీశ్ రెడ్డి, ట్రై కార్ చైర్మన్ ఇస్లావత్ రామచంద్రనాయక్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దేశ రాజకీయాల గురించి మాట్లాడిన జగదీశ్ రెడ్డి.. ప్రధాని మోడీ, కాంగ్రెస్ పార్టీలపై ధ్వజమెత్తారు. దేశ రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్షం లేకుండపోయిందన్నారు. 

కాంగ్రెస్ పార్టీ జీవవచ్చంలా మారిందని.. రాహుల్ గాంధీనీ తొలగిస్తేనే కాంగ్రెస్ కు సోయి లేదని అన్నారు. మోడీ దుర్మార్గాలను నిలువరించేందుకే బీఆర్ఎస్ గా దేశ రాజకీయాల్లోకి అడుగుపెట్టామని, దేశమంతా ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన కోసం ఎదురుచూస్తుందని తెలిపారు. ఇప్పటికే మోడీ పాలనపై మాహారాష్ట్ర నుంచి బీఆర్ఎస్ పార్టీ విప్లవం మొదలుపెట్టింది. ఉత్తరప్రదేశ్ రైతాంగం.. కేంద్రంపై తిరుగు బాటుకు శ్రీకారం చుట్టిందని వెల్లడించారు. రైతుభీమా కోసం సరిహద్దు రాష్ట్రాల రైతులు తెలంగాణాలో భూములు కొంటున్నారని చెప్పుకొచ్చారు. 

మోడీ పాలనలో గుజరాత్ లోనూ దారిద్య్రం పెరిగిపోయింది. 27 రాష్ట్రాలలోని ప్రజలు రోజుకు ఒక్క పూట భోజనం చేస్తున్నారు. దేశంలో ఇప్పటికీ 35 నుండి 40 శాతం మంది ప్రజలు పస్తులుంటున్నారని మండి పడ్డారు. ఈయన పాలనలో దారిద్ర్యం విలయతాండవం చేస్తుంటే చూడలేకపోతున్నామని జగదీశ్ రెడ్డి అన్నారు. భారత్.. పాకిస్తాన్, బంగ్లాదేశ్ లకంటే దైన్యస్థితిలో ఉందని వెల్లడించారు.