
టీఆర్ఎస్ దగ్గర పాఠాలు నేర్చుకునే ఖర్మ మాకు లేదన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. సోమవారం ప్రెస్ మీట్ లో మాట్లాడిన ఆయన.. బండి సంజయ్ అరెస్ట్ అన్యాయమన్నారు. బీజేపీ దీక్ష చేస్తుంటే టీఆర్ఎస్ ఎందుకు భయపడుతుందని ప్రశ్నించారు. ఉద్యోగుల గురించి బీజేపీ పోరాటం చేయడం తప్పా అన్నారు. గతంలో ఇదే విధంగా ఉంటే తెలంగాణ వచ్చేదా అన్నారు. టీఆర్ఎస్ నేతలకు ఒక చట్టం ప్రతి పక్షాలకు మరో చట్టమా అన్న కిషన్ రెడ్డి.. ముందుస్తు, హౌస్ అరెస్టులు తెలంగాణలో కామన్ అయిపోయాయన్నారు. ఎన్నో కార్యక్రమాల్లో టీఆర్ఎస్ లీడర్లు మాస్కులు పెట్టుకోవడంలేదని.. ప్రోటోకాల్ సరిగ్గా అమలైతే టీఆర్ఎస్ నేతలకు జైళ్లు సరిపోవు అన్నారు. మా ఆఫీసులో నిరసన తెలిపే హక్కు కూడా మాకు లేదా అన్న ఆయన.. గ్యాస్ కట్టర్ లు, గడ్డపారలతో ఎంపీ ఆఫీసుపై దాడి ఏంటన్నారు. కరుడుగట్టిన రజాకార్లను, నియంతృత్వాన్ని తరిమికొట్టిన గడ్డ ఇది అని తెలిపారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.